NEW DELHI MEDIA HOUSE
Breaking News

Business

జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 30శాతం రాయితీ.

న్యూదిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వినియోగదారులకు 30 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు దేశీయ, అతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనున్నాయి. ఈ ఆఫర్‌ జులై 23వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.  
అసత్య వీడియోల హల్‌చల్‌ అడ్డుకట్ట ?! .

వాట్సాప్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. మెస్సేజ్‌లు, ఫోన్‌కాల్స్‌, వీడియోకాల్స్‌ అన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌ వాట్సాప్‌. ఇక గ్రూపుల్లో ఉండే వారి సంగతి గురించి ప్రత్యేక చెప్పనవసరం లేదు. కొందరు మంచి విషయాలను పంచుకుంటే, ఇంకొందరు తమ మొబైల్‌కు వచ్చిన ప్రతి మెస్సేజ్‌ను గ్రూపులో పంచుకుంటూ ఇబ్బంది కలిగిస్తారు.  
బెంగళూరులో ‘హెలీ’ట్యాక్సీలు!

బెంగళూరు: నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ-కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య బాడుగ హెలికాప్టర్‌ సేవలు విజయవంతంగా ఆరంభం కావటంతో స్ఫూర్తిపొందిన బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె బాధ్యులు నాలుగు చోట్ల హెలీపాడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  
విజయవాడలోమల్టీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు .

విజయవాడలోని ఏఎం ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యంతర డీపీఆర్‌పై విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశానికి జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ ‘కేఎఫ్‌డబ్ల్యూ’ టెక్నికల్‌ బృందం కూడా పాలు పంచుకుంది. ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డితో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయ క్రిష్ణన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జె నివాస్‌ తదితర ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న శిస్ర్టా ప్రతి నిధు తమ మధ్యంతర రిపోర్టును సమావేశం ముందుంచారు.  
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి : చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో  ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు, సరుకు రవాణా సులభతరం అవుతుందని వివరించారు.  
ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ .

భారతి ఎయిర్‌టెల్‌ మరో కొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఇన్‌ఫినిటీ ప్లాన్‌ రూ.499, ఆపైన రీఛార్జ్‌ చేయించుకునే పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు ఏడాది పాటు అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.  
పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పెంచే దిశగా ?? i

వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును; పన్ను శ్లాబులను పెంచే దిశగా ఆర్థిక శాఖ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 2018-19 బడ్జెట్‌లో ప్రస్తుత రూ.2.5 లక్షల వార్షిక పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు కాకపోయినా.. కనీసం రూ.3 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. మధ్యాదాయ వర్గాలకు ఊరటనివ్వడం కోసం పన్ను శ్లాబులను సైతం మెరుగుపరచే దిశగా ఆ శాఖ పనిచేస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్రభావం పడుతున్న వేతన జీవుల కోసం ఆ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది.  
ఆధార్‌ గడువు పొడిగింపు మార్చి 31 వరకు పెంపు .

దిల్లీ: వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసే గడువును మార్చి 31 వరకు పొడిగించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.  
500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి లోకేష్

మంగళగిరిలోని ఆటోనగర్‌లో ఫై కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 500 మంది ఉద్యోగులతో సాఫ్ట్‌వేర్ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. ఆరు నెలల్లో మరో 500 మందికి ఉద్యోగావకాశాలు ఆ సంస్థ కల్పించనుంది.  
రూ.500కే 4 జీ ఫోన్‌?

ముంబయి: ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సదుపాయాలతో టెలికాం రంగంలో పెనుమార్పులు సృష్టించిన రిలయన్స్‌ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వీఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదీ ఈ నెలలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది. అంతేకాదు దీన్ని కేవలం రూ.500కే అందించాలని జియో యోచిస్తోంది. ఇదే గనక జరిగితే జియో మరో సంచలనానికి తెరతీసినట్టే. ఈ నెల 21న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో కొత్త ఫోన్‌ విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
పాత రూ.500, రూ.1000నోట్లు మళ్లీ మార్చుకోవచ్చు..

ముంబయి: రద్దయిన పాత నోట్లు కలిగి ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసులకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మరో అవకాశం కల్పించింది. పాత రూ.500, రూ.1000నోట్లు ఉన్న బ్యాంకులు 30 రోజుల్లోగా ఏ ఆర్బీఐ బ్రాంచిలోనైనా జమచేసుకుని, కొత్త నోట్లను తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.  
అమరావతికి సొంత ఎయిర్ లైన్స్.

అమరావతికి సొంత ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఢిల్లీ-ఇండోర్-తిరుపతి- విజయవాడ-ముంబై- విజయవాడ-తిరుపతి- ఢిల్లీ మధ్య జులైలో జూమ్ ఎయిర్ సర్వీసులు నడవనున్నాయి.  
50 కోట్ల మంది వినియోగదార్ల ఎస్‌బీఐ

ముంబయి: ఎస్‌బీఐలో కలవబోతున్న 5 అనుబంధ బ్యాంకుల శాఖలన్నీ ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ శాఖలుగా కార్యకలాపాలను నిర్వర్తించనున్నాయి. ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా డిపాజిటర్లతో పాటు వినియోగదార్లందరినీ.. ఏప్రిల్‌ 1, 2017 నుంచి ఎస్‌బీఐ వినియోగదార్లుగా పరిగణిస్తామ’ని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.  
హై గ్రాఫిక్స్‌ యాప్స్‌ ఎంఐ కొత్త ఫోన్‌ .

చైనా మొబైల్‌ దిగ్గజం ఎంఐ నుంచి మ్యాక్స్‌ 2 పేరుతో కొత్త ఫోన్‌ రానుంది. 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం ఉన్న బ్యాటరీ, 128 జీబీ అంతర్గత మెమరీ.. వేగంగా పని చేసేందుకు క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌.. 6జీబీ ర్యామ్‌తో రాబోతుంది.  
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రోబో.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లోకి అడుగు పెట్టినప్పుడు, ‘మీకు ఏ విధంగా సహాయపడగల’ను అంటూ ఆప్యాయంగా పలకరించే ఉద్యోగి కనిపిస్తే.. కాస్త తేరిపార చూడండి. ఎందుకంటే..? ఆ ఉద్యోగి ఏ రోబోనో అయి ఉండొచ్చు.  
మధ్య తరగతి ఆదాయ వర్గాలు మనోరంజని !!.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ కోసం అందరూ, ముఖ్యంగా మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి తాజా బడ్జెట్‌లో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడించింది.   
కరెన్సీ నోట్లను ఎందుకు రద్దు .

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఊహించని షాకిచ్చింది. దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.  
ఎన్ ఆర్ ఐ లు జూన్‌ 30వ తేదీ దాకా పాతనోట్లు మార్చుకోవచ్చు!

ముంబయి: రద్దయిన పెద్దనోట్ల మార్పిడికి సంబంధించి భారత రిజర్వు బ్యాంకు శనివారం రాత్రి తాజా ప్రకటన చేసింది. విదేశీ పర్యటనల్లో ఉండి పెద్దనోట్ల రద్దు ప్రకటన అమల్లోకి వచ్చిన 2016 నవంబరు 9 నుంచీ గడువుగా నిర్ధారించిన డిసెంబరు 30వ తేదీలోగా మార్చుకోలేకపోయిన భారతీయులు 2017 మార్చి 31వ తేదీలోగా వాటిని మార్చుకోవచ్చు.    
నూతన సంవత్సర కానుకగా క్లాసిక్‌ 350 రెడిచ్‌,.

దిల్లీ: ఎన్‌ఫీల్డ్‌ అభిమానులకు నూతన సంవత్సర కానుకగా క్లాసిక్‌ 350 రెడిచ్‌ను మూడు కొత్త రంగుల్లో మార్కెట్లోకి విడుదల చేశారు. రెడ్‌, గ్రీన్‌, బ్లూ రంగుల్లో ఈ బైక్‌లు అందుబాటులోకి వచ్చాయి. 1950 దశకంలో యూకేలో రెడిచ్‌లను తయారు చేశారు.  
మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త .

హైదరాబాద్‌: మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. పెద్దనోట్ల రద్దు వల్ల మొబైల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ఫోన్లపై వ్యాట్(విలువ ఆధారిత పన్ను)ను తగ్గిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins