NEW DELHI MEDIA HOUSE
Breaking News

Cinema

రజనీ భార్యకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రజనీ నటించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి కర్ణాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది.  
ఆయేయో అమలాపాల్‌ !!

చెన్నై: ప్రముఖ నటి అమలాపాల్‌ ఎట్టకేలకు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సరెండరయ్యారు. పన్ను ఎగవేత విషయంలో అమలాపాల్‌ కొన్ని నెలలుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తప్పుడు చిరునామా పత్రాలు సృష్టించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆమెపై కేరళలో కేసు నమోదైంది. 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  
చెర్రీ మాస్ లుక్ అదిరిపోయింది .

రామ్ చరణ్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా ఫస్ట్‌లుక్ శనివారం విడుదలై దుమ్ము లేపింది. ఫస్ట్‌లుక్‌లో చెర్రీ చిందేస్తున్నట్టుగా తీసిన స్టిల్ అదిరిపోయింది. చెర్రీ మాస్ లుక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.  
అన్నయ్యతో కలిసి పవన్ తెరపై .

తాజాగా సైరాలోనూ అన్నయ్యతో కలిసి పవన్ తెరపై కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఒక ముఖ్యమైన పాత్ర ఉండటంతో, స్టార్ హీరోతోనే ఆ పాత్ర చేయించాలని ఈ సినిమా టీమ్ భావించిందట. ఈ పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఈ పాత్ర కోసం పవన్ కల్యాణ్‌ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.    
వర్మ స్పెషాలిటీ, వద్దు అంటున్నా పోసాని. !!!.

 సినిమాల కన్నా టివి ఇంటర్వ్యూలలో వర్మ చెప్పే సమాధానాలు అటు యాంకర్‌ను ఇటు ప్రేక్షకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ప్రశ్నకు సమాధానానికి ఎలాంటి పొంతన లేకుండా చెప్పడం వర్మ స్పెషాలిటీ. ఇది అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టాడు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రమీదే.   
సల్మాన్‌ ఖాన్‌.. రంజాన్‌.. కనక వర్షం .

 సల్మాన్‌ ఖాన్‌.. రంజాన్‌.. ఈ రెండు పదాలు వింటేనే అర్థమైపోతుంది. ఈ కాంబినేషన్‌ కచ్చితంగా వసూళ్లు కురిపిస్తుందని. ఎందుకంటే రంజాన్‌కి బాలీవుడ్‌ పరిశ్రమలో విడుదలైన వాటిలో 90 శాతం సల్మాన్‌ సినిమాలే. ఇంకా చెప్పాలంటే.. రంజాన్‌ మాసాన్ని సల్మాన్‌ ఎప్పుడో బుక్‌ చేసేసుకున్నారు.  
జబర్దస్త్ యాంకర్ బెజవాడ లింక్ !!

 యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలపై ఇప్పుడు టాలీవుడ్లో రకరకాల గుసగుసలు పోతున్నాయి. రేష్మి చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేస్కుంటుందంటూ చెప్పుకుంటున్నారు. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే సుడిగాలి సుధీర్ అంటున్నారు. ఎటొచ్చీ మళ్లీ సుడిగాలి దగ్గరే ఆగుతున్నారు.   
నేను నిర్దోషిని.. సల్మాన్‌

జోధ్‌పూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ శుక్రవారం జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో ఈరోజు సల్మాన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను నిర్దోషినని, తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ పేర్కొన్నారు.  
సంక్రాంతి కి ‘కాటమరాయుడు’ టీజర్‌

హైదరాబాద్‌: ఈ సంక్రాంతిని ప్రత్యేకం చేయడానికి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘కాటమరాయుడు’ టీజర్‌ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌మీడియా ద్వారా ప్రకటించింది.  
‘స్వర చక్రవర్తి’ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

అవమానాలు.. ఆయన్ని రాటుదేల్చాయి. పేదరికపు పరిహాసాలు.. ఆయనకు లక్ష్యనిర్దేశం చేశాయి. ఆ అనుభవ పాఠాలతోనే ఆయన ‘స్వర చక్రవర్తి’ అయ్యారు. ‘నీ గొంతు.. పాటకు పనికిరాద’న్న వాళ్లకు పాటతోనే సమాధానం చెప్పారు.  
తెలుగు రాష్ట్రాలో మెగా ఫీవర్ .

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చిత్రం విడుదల కానుండటంతో చిరు ఫీవర్ అంతాఇంతా కాదు. ఈ ఫీవర్ ఇపుడు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ సరిహద్దులను దాటి గల్ఫ్ దేశాలకు కూడా పాకింది.   
పవన్‌ను ఆహ్వానించిన వదిన సురేఖ.

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఈనెల 7వ తేదీన గుంటూరు వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 150వ సినిమా వేడుకకు మరిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు మెగాస్టార్ చిరంజీవి భార్య, పవన్ వదిన అయిన సురేఖ రంగంలోకి దిగారు.   
మెగాస్టార్‌పోస్టర్‌పై వర్మ వ్యంగ్యబాణాలు .

హైదరాబాద్‌: ఇటీవల పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ‘కాటమరాయుడు’ పోస్టర్‌గురించి ట్వీట్‌ చేసిన వర్మ ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం పోస్టర్‌పై కామెంట్స్‌ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌ను వర్మ ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ చాలా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు.   
ఖైదీ నంబర్.150 సాంగ్ రిలీజ్

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అని సాగే ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది.   
కృష్ణ 'దేవుడు లాంటి మనిషి'

సూపర్‌స్టార్‌ కృష్ణ 50 నట వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు కృష్ణ నట జీవితంపై, కృష్ణ నటించిన 365 చిత్రాలు గురించి రాసిన 'దేవుడు లాంటి మనిషి' పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో జరిగింది.  
గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదల .

కరీంనగర్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రచార చిత్రం విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు.  
‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కత్రినా సల్లూభాయ్‌.

సల్మాన్‌ఖాన్‌.. కత్రినాకైఫ్‌ కొన్నాళ్ల క్రితం విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత కత్రినా.. రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది.   
సల్మాన్‌ రూ.300కోట్ల భారీ బడ్జెట్‌ సినిమా .

సల్మాన్‌.. నిర్మాతగా భారీ బడ్జెట్‌ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మరో నిర్మాతతో కలిసి రూ.300కోట్ల బడ్జెట్‌తో 102ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను సినిమాగా నిర్మిస్తున్నారట సల్లూభాయ్‌.  
150 కోట్లు ప్రభాస్ జేమ్స్ బాండ్ !! .

భరించలేని ఖర్చును, పోషించలేనంత భారాన్ని తెల్ల ఏనుగుతో పోల్చడం కామన్. యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్-సుజిత్ కాంబినేషన్ లో చేయబోయే సినిమా కోసం ఇలాంటి ఓ తెల్ల ఏనుగును భరించడానికి రెడీ అయిపోయిందట. దిగ్దర్శకుడు శంకర్ తన రోబో 2 సినిమాకు సైతం భరించలేకపోయిన హాలీవుడ్ టెక్నీషియన్ ను ప్రభాస్ సినిమాకు నియమించుకున్నారట.         
భారీ బడ్జెట్ తో సప్తగిరి కామెడీ సినిమా !!.

కామెడీ హీరోతో సినిమా, అచ్చంగా కామెడీ సినిమా తీయడం అంటే ఖర్చు దగ్గర కాస్త బిగిస్తారు. ఎందుకంటే మార్కెట్ ఎలా వుంటుందో అని. కానీ కమెడియన్ సప్తగిరి తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమాకు ఆరు కోట్లు ఖర్చు పెట్టేసారు. విదేశాల్లో పాటలు కూడా తీసారు.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins