NEW DELHI MEDIA HOUSE
Breaking News

Cricket

ధోనీ భార్యపై కేసు నమోదు,.

భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఎమ్‌.ఎస్‌ ధోనీ భార్య సాక్షి ధోనీపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది.సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.  
టీమిండియా మరోసారి విజయం,.

సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి విజయంతో నిరూపించుకుంది. న్యూజిలాండ్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 178 పరుగుల తేడాతో గెలుపొంది మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.   
‘ఎమ్‌.ఎస్‌ ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమ్‌.ఎస్‌ ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ను దిల్లీలో సుషాంత్‌ సింగ్‌ చదివిన కులాచి హన్స్‌రాజ్‌ మోడల్‌ స్కూల్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ధోనీ కూడా విచ్చేశారు. ధోనీ రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఈ చిత్రంలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాని నటించింది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.   
మనోహర్ వారసుడిగా ఠాకూర్ !!

ముంబయి: శశాంక్‌ మనోహర్‌ వారసుడెవరో తేలిపోయింది. ముంబయిలో జరగబోయే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు. శనివారం అధ్యక్ష పదవికి ఠాకూర్‌ ఒక్కడే నామినేషన్‌ వేశాడు. అతను బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశాడు. ప్రస్తుతం బోర్డు అధ్యక్షుణ్ని ప్రతిపాదించే అధికారం ఈస్ట్‌ జోన్‌దే. ఆ జోన్‌లోని ఒక సంఘం ప్రతిపాదించినా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. ఐతే భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా అయిన ఠాకూర్‌కు మద్దతుగా ఈస్ట్‌ జోన్‌లోని ఆరు సంఘాలూ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయడం విశేషం. ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడం కోసం మనోహర్‌ కొన్ని రోజుల కిందటే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్‌ స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడైన షిర్కే ఎంపికయ్యే అవకాశాలున్నాయి. లోధా కమిటీ ప్రతిపాదనల్ని అమలు చేసే సామర్థ్యం లేకపోవడం వల్లే తాను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నానని శశాంక్‌ మనోహర్‌ తెలిపాడు.  
కోహ్లి@ నంబర్ వన్

కోహ్లి@ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.   
రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు

రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు  అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ ఓపెనర్ రిషబ్ పాంట్ దుమ్మురేపాడు.  
ధోనీపై అగార్కర్ విమర్శలు: జట్టులో స్థానమేంటి..? ఆయనకంత సీన్ లేదా?

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ పరాభవం నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ ధోనీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్.. జట్టులో ధోనీ స్థానాన్ని ప్రశ్నించాడు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, పరిమిత ఓవర్లలో ధోనీ పాత్రపై ఓ నిర్ణయానికి రావాలంటున్నాడు.   
చివరి ట్వంటీ20 వరుణుడి ఖాతాలోకి.. భారత్‌కు దక్కని ఊరట...

ట్వంటీ-20 సిరీస్‌ను పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ గురువారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి వుండగా, గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం వల్ల అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది.   
సచిన్ సలహా ఊతమిచ్చింది.. వరల్డ్ కప్‌లో ఆడుతా: యువీ

ట్వంటీ-20 ప్రపంచకప్ ఆడే జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆటను ఆస్వాదించేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటానని యువీ తేల్చి చెప్పాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ లీగ్‌లో ఆడే సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, వరల్డ్ కప్‌లో ఆడటం కోసం అంతకుముందు జరిగే టోర్నీలపై దృష్టి పెడతానన్నాడు.   
ట్వంటీ-20 సిరీస్ : నేడు సఫారీల

ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ గురువారం చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు చేతిలో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయిన విషయంతెల్సిందే  
కటక్ బారామతిపై రెండేళ్ళ నిషేధం విధించాలి : సునీల్ గవాస్కర్

కటక్‌లోని బారామతి క్రికెట్ స్టేడియంలో రెండేళ్ళ పాటు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.  
జెంటిల్మన్ గేమ్ కోసం క్రీజులోకి దిగుతున్న క్రికెట్ దేవుడు సచిన్!

క్రికెట్ దేవుడు సచిన్ మళ్లీ క్రీజులోకి దిగనున్నాడు. జెంటిల్మన్ గేమ్‌ కోసం సచిన్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. జెంటిల్మన్ గేమ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.  
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయనను బీసీసీఐ సభ్యలంతా ఎన్నుకున్నారు.   
నెక్ టు నెక్... భారత్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

తొలి టీ20 మ్యాచ్‌లో ఉత్కంఠభరిత వాతావరణం మధ్యన భారత్‌పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.  
జింబాబ్వేపై పాకిస్థాన్ గెలుపు : టీ-20 సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన చివరి ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండు టీ 20లతో పాటు మూడు వన్డేలు ఆడేందుకు గాను పాకిస్థాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ట్రోఫీని గెలుచుకునే మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.  
భారత్ - దక్షిణాఫ్రికా సమరం : నేడు తొలి టీ-20 వామప్‌ మ్యాచ్‌

భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య క్రికెట్ సమరం నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా భారత్ ఏ జట్టుతో సఫారీలు తొలి వామప్ మ్యాచ్‌ను మంగళవారం ఆడనున్నారు. ఈ పర్యటన రెండున్నర నెలల పాటు జరుగనుంది. ఇందులోభాగంగా యువకులు, అనుభవజ్ఞులతో పటిష్టంగా ఉన్న సఫారీ జట్టు మంగళవారం జరిగే టీ-20 వామప్‌ మ్యాచ్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌-ఎతో పోటీ పడనుంది.   
దక్షిణాఫ్రికాతో 72 రోజుల సుదీర్ఘ సిరీస్: 7వేల అడుగుల ఎత్తులో బూట్ క్యాంప్!!

దక్షిణాఫ్రికాలో 72 రోజుల పాటు టీమిండియా సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా పేరొందిన సఫారీలతో మ్యాచ్‌లంటే టీమిండియాకు కాస్తంత కష్టమేనని క్రీడా పండితులు అంటున్నారు.  
జహీర్ ఖాన్‌ను టీమిండియా బౌలింగ్ కోచ్‌గా నియమిస్తారా?

స్పిన్ బౌలింగ్ తప్పితే, పేసర్లు ద్వారా మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు కేవలం వేళ్లపై లెక్కబెట్టవచ్చు. గతంలో టీమిండియా బ్యాట్స్ మన్ ప్రత్యర్థులకు భారీ లక్ష్యాలు నిర్దేశిస్తే.. బౌలర్లు వారి పనిపట్టేసేవారు.   
బీసీసీఐ పగ్గాలు ఎవరికి? శ్రీనివాసన్ వర్సెస్ రాజీవ్ శుక్లా!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ఆ సంస్థ మాజీ అధినేత, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ ఉవ్విళ్లూరుతున్నారు. బీసీసీఐ అధినేత జగ్మోహన్ దాల్మియా ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి పదవిని భర్తీ చేసేందుకు ముమ్మరంగా చర్యలు  జరుగుతున్నాయి.  
క్రికెట్ పిచ్‌పై రెజ్లింగ్ - కిక్‌బాక్సింగ్.. బెర్ముడా క్రికెటర్ల స్లెడ్జింగ్ ఫలితం..

జెంటిల్‌మేన్ గేమ్‌గా పేరొందిన క్రికెట్‌ పిచ్‌పై క్రికెటర్లు తలపడ్డారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. స్లెడ్జింగ్‌కు దిగిన క్రికెటర్లు ఏకంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరు బ్యాట్‌తో దాడి చేస్తే.. మరొకరు కాలితో తన్నాడు. పిచ్‌‌పై పొర్లాడారు.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins