NEW DELHI MEDIA HOUSE
Breaking News

Devotional

సొంతూరిలోసంక్రాంతి జరుపుకోనున్న ఉపరాష్ట్రపతి .

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంతూరులో సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నారు. బుధవారం నుంచి ఆరు రోజులపాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.  
బాబోయ్ బంగారు బాబా..!!!

బంగారం అంటే మక్కువ ఎవరికి ఉండదు? మరికొందరికయితే అది మరీ ఎక్కువ ఈ కోవకు చెందిన వ్యక్తే ఆ బాబా...బాబాకు, బంగారానికి సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి... ఆయన పేరు సుధీర్ మక్కర్. బంగారు బాబా అంటే చాలామంది టక్కున గుర్తుపడతారు. ఆయన ఒళ్లంతా బంగారమే.  
ప్రకృతిలో మమేకమై కార్తీక వనభోజనం .

కార్తీక మాసంలో వనభోజనం ఆచరించడం ఆధ్యాత్మిక, సామాజిక భావనలను పెంచుతుంది. ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరోగ్యానికి దోహదపడుతాయి. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి. వన భోజనం అంటే పచ్చటి ఆకుల మధ్య ప్రకృతిలో మమేకమై ప్రకృతికి నివేదించే అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం.  
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం,

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన తెలిపారు. దుర్గగుడిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.  
అన్నపూర్ణాదేవి అవతారంలో దుర్గమ్మ

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.  
 గాయత్రీ దేవిగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌

విజ‌య‌వాడ‌: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు జగన్మాత దుర్గమ్మను వేదమాత గాయత్రీదేవిగా అలంక‌రించారు.   పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవతగా అమ్మవారిని కొలుస్తారు. కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పించారు. సకల మంత్రాలకు, వేదాలకు మూలమైన దేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. మహత్తర శక్తిగల జగన్మాత ఐదు ముఖాలతో వరదాభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలిగా  భక్తులకు దర్శనమిచ్చారు.  
బాలాత్రిపుర సుందరీగా దుర్గమ్మ,.

విజ‌య‌వాడ‌: ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం దుర్గాదేవి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.  
అక్టోబర్ 2నుoడి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అక్టోబర్ 2న అంకురార్పణ, 3న ధ్వజారోహణం, అక్టోబర్ 7న గరుడ సేవ, 10న రథోత్సవం, 11న చక్రస్నానం జరగనుందన్నారు. అలాగే 3వతేదీన ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. కాగా... ఈ బ్రహ్మోత్సవాలను లక్షా 80 వేల మంది భక్తులు వాహన సేవలు తిలకించేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. అలాగే మాడ వీధులతో పాటు వెలుపల 30 ఎల్‌ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు.   
దసరా పండుగ ప్రాముఖ్యత ,.

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి పూర్ణిమ వరకు తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు.  
వచ్చే ఏడాది దసరా నాటికి యాదాద్రి

హైదరాబాద్‌: అద్భుత శిల్ప కళా రూపాలతో దైవభక్తి ఉట్టిపడే తీరులో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది దసరా నాటికి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణం పూర్తి చేసి, భక్తుల సందర్శనకు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.   
దసరా నుంచి పసిడి ద్వారాల తొ దుర్గమ్మ ,.

విజ‌య‌వాడ‌: విజయవాడ కనకదుర్గ‌మ్మ‌ ఆలయ ద్వారాలు ఇక నుంచి పసిడి వర్ణంతో  వెలిగిపోనున్నాయి. ఆలయంలోని గర్భగుడి ద్వారాలకు కోటిరూపాయల వ్యయంతో బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి. మధు అనే భక్తుడు ఇచ్చిన బంగారంతో ఈ తాపడం పనులు పూర్తి చేశారు. ఇప్పటి వరకూ వెండి తాపడం చేసిన ద్వారాల నుంచి వెండిని తొలగించి.. పుత్తడిని తాపడం చేశారు. దసరా  నుంచి ఈ ద్వారాల నుంచే దుర్గమ్మ భక్తులకు దర్శనమీయనుంది.  
గంగ ఒడికి చేరనున్న ఖైరతాబాద్ గణపతి

హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి మరికొద్దిసేపట్లో గంగఒడికి చేరనున్నాడు. ఉదయం శోభాయాత్రగా బయలుదేరిన వినాయకుడు మధ్యాహ్నానికి ఎన్టీఆర్‌మార్గ్ గుండా క్రేన్ నెంబర్ 5వద్దకు చేరుకున్నాడు. మహాగణపతికి చివరి పూజలు సైతం పూర్తి అయ్యాయి. ప్రస్తుతం క్రేన్‌ను గణపతికి అమరుస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌మార్గ్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు మహాగణపతి నిమజ్జనాన్ని తిలకిస్తున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ గణనాథుడికి చివరి వీడ్కోలు పలుకుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు తరలిరావడంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి ఐమాక్స్ భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. వేలమంది భక్తులు నిమజ్జన ప్రక్రియను తిలకించేందుకు ఎన్టీఆర్‌మార్గ్‌కు చేరుకున్నారు.  
అందరినీ ఒక్కతాటిపై నడిపిస్తున్నబొజ్జ గణపయ్య !!

వినాయక చవితి వచ్చేసింది.. పార్వతి తనయుడు.. వక్రతుండుడు.. బొజ్జ గణపయ్య భక్తులను ఆశీర్వదించేందుకు నగరానికి విచ్చేశాడు.   
జయేంద్ర సరస్వతి తీవ్ర అస్వస్థత...

కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన సూర్యరావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో హర్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే.     
ఆర్థిక సమస్యలు తొల‌గిపోతాయి. !!!

ఆర్థిక స్థిరత్వం లేక కొందరు, సంపాదించిన సొమ్ము చేతిలో నిలువక మరికొందరు సతమతమవుతుంటారు. ఐతే అలాంటి వారు కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని, సంపాదన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు.  ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని ఎప్పుడు జేబులో ఉంచుకుంటే  ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంది. అట్లే గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను బేసి సంఖ్య‌లో ద‌గ్గ‌ర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జ‌రుగుతుంద‌ట‌.   
బ్రహ్మ ముహూర్తం అంటే ??.

బ్రహ్మ ముహూర్త కాలంలో ఏ శుభకార్యాన్నైనా సఫలమవుతుంది. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువుకోవాలని ఎందుకు సూచిస్తారో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవండి. బ్రహ్మీ ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెప్తున్నారు. విద్యార్థులు బ్రాహ్మి ముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని నమ్ముతారు.   
ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. ఏటా శ్రావణమాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ.   
సచివాలయం కూడా పర్యాటక స్థలం !!!.

 రాజధాని ప్రాంతంలో పుష్కర స్నానాలకు వస్తున్న యాత్రికులు సచివాలయాన్ని సందర్శించి, భవనాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం కూడా పర్యాటక స్థలంగా మారిపోవడం గమనార్హం.  
పుష్కరస్నానం చేసిన వైఎస్ జగన్

విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పుష్కరస్నానం చేశారు. విజయవాడ పున్నమిఘాట్‌లో జగన్ పుష్కరస్నానమాచరించారు. అనంతరం పితృదేవతలకు పిండప్రదానం చేశారు.  
రాఖీపండుగ ఎంతో విశిష్టమైనది

శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకొనే రక్షాబంధన్ లేదా రాఖీపండుగ ఎంతో విశిష్టమైనది. సోదరీసోదరుల దృఢమైన అనుబంధమునకు గుర్తుగా ఈ పండుగ జరుపుకోవడం సంప్రదాయము. ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins