NEW DELHI MEDIA HOUSE
Breaking News

Education

ఏపీకి సెంట్రల్ వర్సిటీ .

ఏపీకి తీపి కబురు అందించింది కేంద్రం. రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పిన కేంద్రం.. అందులో భాగంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  
టెట్‌లో 57.48 శాతం మంది అర్హత .

విశాఖపట్నం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో మొత్తం 57.48 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఆయన టెట్‌-2018 ఫలితాలను విడుదల చేశారు.  
ప్రతిష్టాత్మకంగా తెలుగు మహాసభల ఏర్పాట్లు .

డిసెంబర్ 15 తేదీ నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ సభలకు ఇప్పటికే 8 వేల మంది ప్రతినిధులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సభల్లో కవి సమ్మేళనాలు, సాహిత్యంపై సదస్సులు నిర్వహించనున్నారు.  
బాబోయ్ బంగారు బాబా..!!!

బంగారం అంటే మక్కువ ఎవరికి ఉండదు? మరికొందరికయితే అది మరీ ఎక్కువ ఈ కోవకు చెందిన వ్యక్తే ఆ బాబా...బాబాకు, బంగారానికి సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి... ఆయన పేరు సుధీర్ మక్కర్. బంగారు బాబా అంటే చాలామంది టక్కున గుర్తుపడతారు. ఆయన ఒళ్లంతా బంగారమే.  
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.

న్యూఢిల్లీ, : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీ ఎత్తున ఉపాధి కల్పనతోపాటు నిరుద్యోగం లేకుండా చేస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకూ భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ జరగలేదనీ, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పాలని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.  
ఇంటర్వ్యూ లేకుండానే ఖాళీలను భర్తీ .

నోటిఫికేషన్ల జోరు పెరిగింది. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు... వివాదాలకు తావులేకుండా విధానాలు... నిర్దిష్ట గడువులోపే ఫలితాలు! నిరుద్యోగుల ‘జీవితాలకు పరీక్ష’ పెడుతుందన్న అపఖ్యాతిని ఏడాది కాలంలోనే ఏపీపీఎస్సీ చెరిపేసుకుంది.  
గేమ్స్‌ మూడు స్క్రీన్లు ల్యాప్‌టాప్‌ .

సింగిల్ స్క్రీన్‌గేమ్స్‌లను మనమందరం వాడుతూనే ఉంటాం. కానీ.. మూడు స్క్రీన్ల ల్యాపీలను ఎక్కడైనా చూశారా? కచ్చితంగా చూసుండరు. కానీ.. ట్రెండ్‌ సృష్టించే అలాంటిమూడు స్క్రీన్లు  వచ్చేసింది. దీని ప్రత్యేకత మూడు స్క్రీన్లు కలిగి ఉండట మే! అన్ని స్క్రీన్లు ఎందుకు? అనేగా మీ ప్రశ్న. దీన్ని ప్రత్యేకంగా గేమ్స్‌ కోసం రూపొందించారట.    
అగ్ని-5 విజయవంతం .

భారత ఆర్మీ అమ్ముల పొదిలో మరో అత్యంత శక్తివంతమైన అస్త్రం వచ్చిచేరింది. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణి అగ్ని-5ను రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా ప్రయోగించారు.  
ముఖాలను గుర్తుపట్టి ఇంటి తలుపులు తెరిసేయంత్రం

వాషింగ్టన్‌: ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌ ఓ యంత్రుణ్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కృత్రిమ మేధస్సు పేరు జార్విస్‌. జుకెర్‌బర్గ్‌ 100 గంటల్లోనే (అది కూడా ఖాళీ సమయాల్లోనే) దీన్ని అభివృద్ధిచేశారు.  
ఐఐటీ-బెనారస్‌ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనం.

ఐఐటీ-బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి) విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఇక్కడ నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఓ విద్యార్థికి రూ.1.20కోట్లు వార్షిక వేతనంగా చెల్లించేందుకు ఒరాకిల్‌ ముందుకొచ్చిందని ప్లేస్‌మెంట్‌ నిర్వాహకులు తెలిపారు.  
బుధుడు, శుక్రుడు, భూమి పూర్తిగా ధ్వంసమవుతాయా !!?.

ఓజోన్ పొరలో ఏర్పడిన మార్పుల కారణంగా ప్రకృతీ వైపరీత్యాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. మనకు 200 కాంతి సంవత్సరాల దూరంలో 'ఎల్‌2 పుపిన్స్‌'గా పిలిచే ఓ భారీ నక్షత్రముంది.  
గ్రూప్‌-2 మూడు వారాల్లో నియామక ప్రక్రియ.

గ్రూప్‌-2 సర్వీసెస్‌ 10/1999 నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫైనల్‌ సెలెక్షన్స్‌లో ఏ ఒక్క అభ్యర్థికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, మూడు వారాల్లో నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ స్పష్టం చేశారు.  
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు .

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయో పరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేన్లకు ఈ పరిమితి పెంపు వర్తించనుంది. యూనిఫాం సర్వీస్‌లకు మాత్రం గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2017 సెప్టెంబర్‌ 30 వరకు ఈ జీవో వర్తించనుంది.  
జీశాట్‌-18 టెలికమ్యూనికేషన్‌ సేవలు బలోపేతం ,.

దేశంలో టెలికమ్యూనికేషన్‌ సేవలకు వూతమిచ్చే అధునాతన జీశాట్‌-18 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్‌-5 వీఏ-231 రాకెట్‌ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక దాదాపు 2.00గంటల సమయంలో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.   
యోషినోరి ఓషుమికి నోబెల్ ప్రైజ్,.

స్టాక్‌హోం: 2016 ఏడాదికి సంబంధించి మెడిసిన్‌లో   ప్రకటించారు. జపాన్‌కు చెందిన యోషినోరి ఓషుమికి ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ దక్కింది. అటాఫజీలో నూతన ఆవిష్కరణలు చేసినందుకు గాను ఆయనకు ఈ ప్రతిష్టాత్మక ప్రైజ్ దక్కింది.  
మంగళగిరిలో ఐదేళ్లలో ఎయిమ్స్ను నిర్మిస్తాం'

మంగళగిరిలో నిర్మాణం చేపట్టిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్)ను కేంద్రబృందం సోమవారం పరిశీలించింది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కేంద్ర బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది.    
మెడికల్ సీట్ల అమ్మకాల్లో రూ.500 కోట్ల కుంభకోణం !!.

హైదరాబాద్: మెడికల్ బీ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ రద్దు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు. మెడికల్ సీట్లను అమ్ముకున్నారని, దీనిలో కేబినెట్ మంత్రుల భాగస్వామ్యం కూడా ఉందని పేర్కొన్నారు. ఆర్టికల్ 371డి ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. మెడికల్ సీట్ల అమ్మకాల్లో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని లేఖలో తెలిపారు.  
ఒలింపిక్స్‌ నుంచి పరీక్షలకు........

అగర్తలా: దీపా కర్మాకర్‌.. రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోయినా.. దేశ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకుంది. దీప తన ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు కూడా అంతే విలువిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ ఘటన. రియో నుంచి వచ్చిన మర్నాడే దీప తన ఎంఏ పరీక్షలకు హాజరైంది.  
ఏపీపీఎస్సీ తొలి నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి గురువారం తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. 740 ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ ప్రకటన విడుదల చేశారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ సహా ఇతర శాఖల్లో ఇంజినీర్ల పోస్టులు ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.  
ఉపాధ్యాయ ట్రైనింగ్‌ నీడ్స్‌ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌ వాయిదా

విజయవాడ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహించ తలపెట్టిన సామర్థ్య పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ట్రైనింగ్‌ నీడ్స్‌ ఐడెంటిఫికేషన్ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం జీవోను జారీచేసింది.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins