NEW DELHI MEDIA HOUSE
Breaking News

Health

యాంటిబయోటిక్‌ కాస్త జాగ్రత్తగా ! ?? .

మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో యాంటిబయోటిక్‌ మందులను వాడుతుంటాం. అయితే ఈ సారి నుంచి వాటిని వేసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మన దేశంలో దొరుకుతున్న యాంటిబయోటిక్‌లలో 64శాతం నకిలీవేనట. వాటిని విక్రయించేందుకు ఎలాంటి అనుమతులు లేవట. యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.  
ఎముకలు బలంగా ఉండాలంటే !! ?..

ఎముకలు బలంగా ఉండాలంటే.. 30 దాటిన మహిళలు తప్పకుండా క్యాల్షియం తీసుకోవాలి. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.  
రాష్ట్రంలో 232 ఆరోగ్య కేంద్రాలు : సీఎం

విజయవాడ: మంచినీటి ఎద్దడి, దోమల బెడదపై ప్రతిరోజూ కమాండ్ కంట్రోల్ రూం నుంచి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో 232 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.  
చుక్క కూర ఎక్కువగా వాడితే చుక్కలై !!.

ఇది అందరికీ తెలుసిందే, అందరికీ అందుబాటులో దొరికే ఆకుకూర. చాలా తేలిగ్గా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్నిస్తుంది. నోటికి పుల్లగా వుండి మంచి రుచిని కలిగిస్తుంది. దీన్ని పప్పు కలిపి వండుకోవచ్చు. పులుసుగాను, పచ్చడిగాను, కూరగాను, ఇంకా అనేక రకాలుగాను ఈ ఆకును ఉపయోగిస్తారు. ఇతర కూరలతో కలిపి కూడా వండుకోవచ్చు.  
ఈ కోడి తింటే జీర్ణశక్తి వ్యాధి నిరోధక శక్తీ ?!.

సాధారణంగా బ్రాయిలర్ కోడి మాంసం ధర పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ రకం కోడి ధర నిలకడగా ఉండదు. కానీ కడక్‌నాథ్ అనే జాతి కోడి మాంసం ధర మాత్రం పెరగడమే గానీ నేలచూపే చూడదట. పైగా.. ఈ చికెన్ హాట్‌కేకుల్లా అమ్ముడు పోతోందట.  
స్వీట్ డ్రీమ్స్ కావాలా ?!.

నిద్ర పట్టకుండా చాలామంది సతమతమవుతుంటారు. ఇలాంటివారు రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది. ఇంకా తేనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది.  
జనవరి 1 నుంచి ఉచిత శిశు హృదయ శస్త్ర చికిత్సలు .

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే బృం దం ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి ఉచిత శిశు హృదయ శస్త్రచికిత్సలు జరుగనున్నాయి. ఇప్పటి వరకు స్ర్కీనింగ్‌ చేసి ఆపరేషన్‌ అవసరం అయిన 28 మంది శిశువులను గుర్తించారు. వీరందరికీ జనవరి 1 నుంచి సర్జరీలు నిర్వహిస్తారు.  
రేగి పండ్లలో రోగ నిరోధక శక్తి .

రేగి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎప్పుడైనా ఒత్తిడి, కంగారుగా అనిపించినప్పుడు రెండంటే రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం ఉంటుంది. రేగి పండ్లలో వత్తిడి తగ్గించే గుణాలున్నాయి. రేగి పండ్లలో విటమిన్-సి, ఏ పొటాషియం అధికం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.     
దుంపలతో మూత్రపిండాల వ్యాధులు మాయం.

చౌకగా లభించే చిలకడదుంపలను తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ దుంపలు పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.   
డబ్బులు ఇవ్వకపోయినా ఆపరేషన్‌ చేస్తాం .

గుంటూరు : మీ దగ్గర అన్ని పెద్ద నోట్లే ఉన్నాయా? ఇంకా కొత్త కరెన్సీలోకి మార్చుకోలేదా? మీరు అత్య వసర మైన ఆర్ధోపెడిక్‌ శస్త్రచికిత్స చేయించుకోవాలా? మీకేం ఫర్వాలేదు. ‘‘కేవలం ఆధార్‌ కార్డుతో రండి. డబ్బులు ఇవ్వకపోయినా ఆపరేషన్‌ చేస్తాం’’ అంటూ గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ప్రకటించారు.  
సక్సెస్ సెక్స్ మంత్ర !!

లేటుగా పడుకోవడం.. లేటుగా నిద్రలేవడం... న‌గ‌ర జీవితంలో కామ‌న్ అయిపోయింది. ఆఫీస్ వర్కో, పెండింగ్ ప్రాజెక్టో, బోర్డు మీటింగో, పార్టీయో, ఫంక్షనో.. ఏదీ లేక‌పోతే, బేవార్స్‌గా అర్ధ‌రాత్రి వ‌ర‌కు తోచ‌క తిరిగొచ్చి... ఒంటి గంట దాటితే గానీ బెడ్ మీదకి చేరుకోవడం లేదు. దాంతో ఏం మిస్సవుతున్నామో తెలుసా? నిజంగా అవి ఫీల‌యితే... మీరు బారెడు పొద్దుఎక్కే వ‌ర‌కు ప‌డుకోరు.  
దేవతలకు అమృతం మనిషికి వెల్లుల్లి .

వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం. వెల్లుల్లి మీ బ‌రువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది.  
లైంగిక శక్తి పెరగాలంటే ??.

మునగ ఆకు అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే మునగాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మునగాకులో కడుపునొప్పి మంటలను తగ్గించే గుణాలున్నాయి. మూత్ర వ్యాధులకు నేత్రరోగాలకు బాగా ఇది పనిచేస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది.  
ఒళ్ళు త‌గ్గాలంటే ఓట్స్‌ !!!.

మ‌న ఒళ్ళు ఈజీగా పెరిగిపోతుంది... త‌గ్గాలంటేనే ఎంతో ప్ర‌యాస. ఒకసారి బరువంటూ పెరిగిన తర్వాత దానిని తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. అయితే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుని... శరీరంలోని అదనపు కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు.   
ప్రజారోగ్యం తోనే అభివృద్ధి : చంద్రబాబు

విజ‌య‌వాడ‌: ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని...అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. పరిశుభ్రత ప్రజా జీవనంలో భాగం కావాలన్న ఆయన....అంటువ్యాథులపై అందరిలో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత-ప్రజారోగ్యంపై  సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  
గుండెపోటు తగ్గించడంలో నువ్వుపొడి,.

గుండెపోటు, స్ట్రోక్స్‌కు దారితీసే రక్తపోటును తగ్గించడంలో నువ్వుపొడిలోని మాంగనీస్‌ ఉపకరిస్తుంది. కలోన్‌ క్యాన్సర్‌, ఆస్టియోపోరోసిస్‌, మైగ్రేన్‌, బహిష్టు ముందు కలిగే సమస్యలను తగ్గించడంలో వీటిలోని క్యాల్షియం తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించగల గుణాలు నువ్వుల్లో ఉన్నాయి. నువ్వుల పొడిని తరచూ తీసుకుంటే రకరకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు  
అంటు వ్యాధులనిర్మూలించటమే లక్ష్యం,. చంద్రబాబు

అమ‌రావ‌తి: దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత నినాదంతో  రాష్ట్రంలో ముమ్మర కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన....ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్ వరకు..., ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి వరకూ అంటు వ్యాధులపై యుద్ధంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.   
మందార ఆకులలో రక్తపోటు మటాష్..

మందార ఆకులలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది.  సౌందర్యానికి సహజసిధ్ధంగా మేలుచేసే సౌందర్య సాధనం మందారం. మందారం పువ్వు ఆడవారి సిగకే కాదు కేశానికి కూడా అందాన్నిస్తుంది. మందారం చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...    
ఆరోగ్య బీమాల ఆదాయ రూ.21,00 పరిమితి పెంపు

దిల్లీ: ఉద్యోగుల బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సామాజిక ఆరోగ్య భద్రతా పథకాల్లో లబ్ధి పొందేందుకు అర్హమైన గరిష్ఠ ఆదాయ పరిమితి నెలకు రూ.21,000 పెరిగింది. ఇప్పటివరకూ ఇది రూ.15,000గా ఉండేది. దీంతో కొత్తగా 50 లక్షల మందికి బీమా ఫలాలు చేరువయ్యే అవకాశముంది.  
మొలకలలో ఎ, సి, బి 1, బి 6, కె విటమిన్లు,

పెసలు, శనగలు, బీన్స్ , ఎండిన బఠానీలు దేశవ్యాప్తంగా ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిని మొలకలతో తినడం చేస్తున్నారు. ఈ మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు, మాంసకృతులు సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో ఎ, సి, బి 1, బి 6, కె  విటమిన్లు, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins