NEW DELHI MEDIA HOUSE
Breaking News

మెగా స్టార్ దర్శకత్వం వహిస్తాడా

Updated: Tuesday 28,2014

అవుననే అంటున్నాయి మెగా వర్గాలు ? ఇప్పటికే చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందాని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమవుతోంది. కానీ ఆ వార్తలన్నీ వదంతులుగానే మిగిలిపోతుండటం మాత్రం మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే అన్నయ్య చిరంజీవి తన 150వ చిత్రానికి తనే దర్శకత్వం వహించేయాలనే ప్లాన్ లో ఉన్నారట? ఇప్పటివరకూ చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ వీరెవ్వరూ కన్ ఫార్మ్ అవ్వలేదు. అయితే తనకున్న అనుభవంతో తనే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తే ఈ ప్రాజెక్ట్ కి భారీ క్రేజ్ నెలకొంటుందని కూడా చిరు భావిస్తున్నారట. చిరుకి అపారమైన జడ్జిమెంట్ ఉందని పరిశీలకులు అంటుంటారు. తన తండ్రి జడ్జిమెంట్ మీద రామ్ చరణ్ కి కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే చిరంజీవి దర్శకత్వం వహించాలనే ఆలోచనకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి మంచి ప్రోత్సహం లభిస్తోందట. మరి తన 150 వ చిత్రానికి చిరు దర్శకత్వం వహిస్తాడో లేదో చూడాలి ?


 
Tags:  index follow noarchive noodp noydir
 

Related Stories