NEW DELHI MEDIA HOUSE
Breaking News

400 కేజీల గంజాయి పట్టివేత

Updated: Sunday 03,2015

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కొత్తకోట సమీపంలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తుపాకీలతోపాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. నిందితులకు చెందిన రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.


 
Tags:  ganja seized  kothakota  visakhapatnam district police  గంజాయి సీజ్  కొత్తకోట  విశాఖ జిల్లా పోలీసులు
 

Related Stories