NEW DELHI MEDIA HOUSE
Breaking News

సచిన్ సలహా ఊతమిచ్చింది.. వరల్డ్ కప్‌లో ఆడుతా: యువీ

Updated: Thursday 08,2015

ట్వంటీ-20 ప్రపంచకప్ ఆడే జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తానని టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆటను ఆస్వాదించేంతవరకు క్రికెట్ ఆడుతూనే ఉంటానని యువీ తేల్చి చెప్పాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ లీగ్‌లో ఆడే సందర్భంగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, వరల్డ్ కప్‌లో ఆడటం కోసం అంతకుముందు జరిగే టోర్నీలపై దృష్టి పెడతానన్నాడు. 
 
అంతేగాకుండా వరల్డ్ కప్ కోసం ఆడే భారత జట్టులో స్థానం సంపాదించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని యువీ వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ ప్రత్యేకమైనదని, అది వన్డే వరల్డ్ కప్ అయినా, టీ-ట్వంటీ వరల్డ్ కప్ అయినా ప్రత్యేకమేనని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది ట్వంటీ-20 సిరీస్ జరుగనున్న తరుణంలో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తానని చెప్పాడు.
 
క్యాన్సర్‌తో బాధపడుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఊతమిచ్చాయని యువీ చెప్పాడు. సచిన్ ఇచ్చిన సలహాలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయన్నాడు. కాగా వన్డే వరల్డ్ కప్ 2011లో యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.


 
Tags:  Tendulkar   Yuvraj   2011 World Cup   Twenty-20 World Cup   2014-15 Ranji Trophy Season
 

Related Stories