NEW DELHI MEDIA HOUSE
Breaking News

చివరి ట్వంటీ20 వరుణుడి ఖాతాలోకి.. భారత్‌కు దక్కని ఊరట...

Updated: Friday 09,2015

ట్వంటీ-20 సిరీస్‌ను పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ గురువారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సి వుండగా, గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం వల్ల అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సఫారీలు సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకున్నారు.మధ్యాహ్నం నుంచే వర్షం పడటంతో మైదానం చిత్తిడిగా మారిపోయింది. దీంతో సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో మైదానంలో కప్పిన కవర్లు తీసేశారు. 7.30 గంటలకు ఒకసారి, గంట తర్వాత రెండోసారి ఫీల్డ్‌ను పరీక్షించిన అంపైర్లు సంతృప్తి వ్యక్తం చేయలేదు. చివరగా 9.30 గంటలకు మూడోసారి పరిశీలించగా ఆటకు మైదానం అనుకూలంగా లేదని నిర్ణయించారు. ఇరు జట్ల కెప్టెన్లను సంప్రదించి మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సిరీస్‌లో సఫారీ బ్యాట్స్‌మన్‌ జేపీ డుమిని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును కైవసం చేసుకున్నాడు. కాగా, ఇరు జట్ల మధ్య ఈనెల 11న జరిగే మ్యాచ్‌తో ఐదు వన్డేల సిరీస్‌ మొదలనుంది. 


 
Tags:     South Africa Win Series   3rd Twenty20 Match Abandoned Without A Ball Being Bowled
 

Related Stories