NEW DELHI MEDIA HOUSE
Breaking News

కోహ్లి@ నంబర్ వన్

Updated: Monday 01,2016

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ సిరీస్ ద్వారా 47 రేటింగ్ పాయింట్లను సాధించిన కోహ్లి మొత్తంగా 892 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.  సోమవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తాజాగా విడుదల చేసిన టీ 20 ర్యాంకింగ్స్ లో  ఆసీస్ టీ 20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను కోహ్లి వెనక్కునెట్టి  ప్రథమ స్థానంలో నిలిచాడు. తొలి మ్యాచ్ లో 90 నాటౌట్, రెండో మ్యాచ్లో 59 నాటౌట్, మూడో మ్యాచ్లో 50 పరుగులు చేసిన కోహ్లి ఒక ద్వైపాక్షిక టీ 20 సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఇదిలా ఉండగా, ఈ సిరీస్ లో 44, 74 పరుగులతో రాణించిన ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ 14 రేటింగ్ పాయింట్లను మాత్రమే సాధించి 868 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇతర టీమిండియా ఆటగాళ్లలో సురేష్ రైనా మూడు స్థానాలకు ఎగబాకి 13 వ స్థానానికి చేరగా, రోహిత్ శర్మ నాలుగ స్థానాలను మెరుగుపరుచుకుని 16వ స్థానంలో నిలిచాడు.


 
Tags:   virat kohli  T20 Internationals  india  విరాట్ కోహ్లి  టీ 20 మ్యాచ్ సిరీస్  భారత్
 

Related Stories