NEW DELHI MEDIA HOUSE
Breaking News

అల్లు అర్జున్ పవన్ వివాదానికి తెర దించిన బన్నీ

Updated: Thursday 19,2016

పవర్ స్టార్ గురించి నేను మాట్లాడను అంటూ బన్నీ చేసిన కామెంట్ల గురించి పెద్ద చర్చే జరిగింది. దీనికి అల్లు అర్జున్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. నిహారిక, నాగశౌర్య నటించిన ఒక మనసు ఆడియో వేడుక సందర్భంగా హాజరయిన అల్లు అర్జున్ సూటిగా ఈ విషయాలపై చర్చించాడు. అల్లు అర్జున్ మాటల్లోనే... బ్రదర్స్ మీతో 10 నిమిషాలు మాట్లాడాలి. తప్పకుండా అన్నీ మాట్లాడేస్తా. బయటి ఫంక్షన్లకు వెళ్లి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. వారు వాళ్లు హర్ట్ అవుతారు కదా. ఒక మిత్రుడు మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి బ్రదర్ అన్నారు. కరెక్టే కదా.

చిరంజీవి గారి ద్వారా మేమంతా ఇండస్ట్రీలోకి వచ్చినవాళ్లం. చిరంజీవి మాట్లాడుతున్నప్పుడూ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తారా. పవర్ స్టార్ అంటే చిరంజీవి గారికి ఇష్టం ఉండదా. అలా అరిస్తే ఆయనక్కూడా ఇష్టమే. కానీ ఆయన మాట్లాడేది వినాలి కదా. ఫ్యాన్స్ లో కొద్దిమంది మాత్రం ఇలా పవర్ స్టార్ అంటూ నానా హంగామా చేసి దిగిపోతున్నాం బ్రదర్. మంచిది కాదు.
 
చిరంజీవి గారు మాట్లాడేటపుడు పవర్ స్టార్... పవర్ స్టార్ అంటూ గుచ్చిగుచ్చిమాట్లాడటం చూసి నేను హర్ట్ అయ్యా. పవర్ స్టార్ గురించి నేను ఇవాళ చెప్పినా ప్యాచప్ అంటారు. అందుకే చెప్పను. అసలు ఆయన గురించి నాకు, నా గురించి ఆయనకు బాగా తెలుసు. కొందరు చేస్తున్న కామెంట్ల వల్ల ఫీలవుతున్నా. మీడియా ముందు చెబితే లక్ష అర్థాలు వస్తాయి. అందుకే చెప్పలేదు. 
 
నేను మాట్లాడిన మాటలకు మీరు హర్ట్ అయ్యి ఉంటారు. సోషల్ మీడియాలో వెర్బల్ వర్డ్స్ తగ్గించండి. మనవాళ్లే హర్ట్ చేస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను పవర్ స్టార్ అంటాను... పవర్ స్టార్, పవర్ స్టార్... ఓకేనా..."అంటూ ముగించారు అల్లు అర్జున్.


 
Tags:  Controversy between Allu Arjun and Pavan Kalyan:Bunny expains his stand in Oka Manasu Movie Audio Release.
 

Related Stories