NEW DELHI MEDIA HOUSE
Breaking News

కబాలి గా రజని ఘర్జన : జూన్ 1 నుండి

Updated: Friday 20,2016

జనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం‘కబాలి’. రాధికా ఆప్టే కథానాయిక. కలైపులి.ఎస్‌.థాను నిర్మాత. పా రంజిత్‌ దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో పాటల్ని, జులై 1న చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ నెల 1న విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ సుమారు కోటిన్నరమంది వీక్షించారు. రజనీ చెప్పిన డైలాగులు మార్మోగుతున్నాయి. రజనీకాంత్‌ మాత్రమే చేయగలిగిన సినిమా ఇది. సంతోష్‌ నారాయణ్‌ మంచి బాణీల్ని అందించార’’న్నారు. ధ¿న్సిక, కిషోర్‌, జాన్‌ విజయ్‌ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: మురళి, మాటలు: సాహితి, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్‌, అనంత్‌ శ్రీరామ్‌


 
Tags:  Rajni's Kabali releasing on June 1st.
 

Related Stories