NEW DELHI MEDIA HOUSE
Breaking News

పుష్కర ఘాట్ల ను పరిసీలించిన రాముడు

Updated: Saturday 21,2016

కృష్ణానది పుష్కరాలను పురస్కరించుకుని శుక్రవారం అమరావతి, సీతానగరం వద్ద పుష్కర ఘాట్లను డీజీపీ జేవీ రాయుడు పరిశీలించారు. తొలుత ధ్యానబుద్ధ సమీపంలోని ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం అమరేశ్వర స్నానఘాట్‌ను సందర్శించి పుష్కరాలకు అమరావతికి ఎంతమంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ల వద్దకు వచ్చే రహదారులు, పార్కింగ్‌ ఏర్పాట్ల గురించి రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ వివరించారు. ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీజీపీ వెంట సురేంద్రబాబు, ఐజీ సంజయ్‌, అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి, డీఎస్పీ మదుసూధనరావు, సీఐ మురళీకృష్ణ, ఎ స్‌ఐలు వెంకటప్రసాద్‌, రహంతుల్లా, సిబ్బంది ఉన్నారు. అనంతరం సీతానగరం కృష్ణానది పుష్కర ఘాట్లను డీజీపీ రాయుడు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి మహానాడు రైలు వంతెన వరకు వున్న పుష్కర ఘాట్లను ఏవిధంగా అభివృద్ధి చేయనున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీతానగరం వద్ద 360 మీటర్ల మేర ఘాటు ఏర్పాటు చేస్తున్నట్టు అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి డీజీపీకి వివరించారు. వర్షపు జల్లుల కారణంగా తాత్కాలిక సచివాలయంలోకి వెళ్లే దారులు బురదతో కూడుకున్నాయి. ఈ దారిలో ఓ వాహనం బురదలో కూరుకుపోయింది. ఈ సమయంలో డీజీపీ తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించటానికి వచ్చారు. బురదమయంగా ఉన్న దారి నుంచి కొంత దూరం వెళ్ళి వాహనాలు తిరగవని చెప్ప టంతో, ఆయన కారు దిగకుండానే వెనక్కి మరలారు.


 
Tags:  D.G.P Ramudu inspects Pushkar Ghats.
 

Related Stories