NEW DELHI MEDIA HOUSE
Breaking News

జింక చర్మంతో షారుక్‌ బూట్లు ఏకంగా కటకటాల పాలయ్యాడు !!.

Updated: Saturday 27,2016

పెషావర్‌: సినీ తారలపై అభిమానానికి హద్దులుండవు. ఆ మోజులో పలికే ప్రగల్భాలు ఎక్కడికి దారి తీస్తాయో చెప్పడానికి ఉదాహరణ ఈ సంఘటన. పాకిస్థాన్‌లోని పెషావర్‌ పట్టణంలో షారుక్‌ అభిమాని ఒకరు ఏకంగా కటకటాల పాలయ్యాడు. అతనేం చేశాడంటే..

జహంగీర్‌ పెషావర్‌లో ఒక ప్రఖ్యాత చెప్పుల షాపు యజమాని. ఆ నగరంలోనే నివసించే షారుక్‌ కజిన్‌ ఒకరు షారుక్‌ కోసం రెండు జతల మంచి బూట్లు తయారుచేసిమ్మని జహంగీర్‌ను కోరాడు. అసలే షారుక్‌ అంటే విపరీతమైన అభిమానం గల జహంగీర్‌ జింక చర్మంతో షారుక్‌ కోసం ప్రత్యేకంగా బూట్లు తయారు చేసి తన బహుమతిగా పంపిస్తానని చెప్పాడు. అంతటితో వూరుకోకుండా తాను షారుక్‌కోసం ప్రత్యేకంగా బూట్లు తయారుచేస్తున్నానంటూ పత్రికల వారికి కూడా చెప్పాడు. పత్రికల్లో ఆ వార్త చూసిన వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు జహంగీర్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. కేసు విచారిస్తున్నామని, నిజంగానే అతడు పాదరక్షల తయారీలో జింక చర్మం వాడుతున్నాడా అన్నది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతడు నిజంగానే జింకచర్మం వాడుతున్నట్లయితే వన్యప్రాణి సంరక్షణ చట్టంకింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.


 
Tags:  fan make shoes to sharuk khan fan behind bars
 

Related Stories