NEW DELHI MEDIA HOUSE
Breaking News

అల్లంత దూరానఅందంగా ఆంద్ర గోవా.!!

Updated: Friday 23,2016

సహజసిద్ధమైన సముద్ర తీరం. అర్థ చంద్రాకారంలో కనిపించే తీరప్రాంతం. అల్లంత దూరాన కనిపిస్తూ మదిని దోచే నల్లటికొండలు. తీరాన్ని ఆనుకొని అందంగా ప్రవహించే ఉప్పుటేరు. తీరంవద్ద నిలిపిఉంచే రంగురంగుల పడవులు... ఇదేదో గోవా బీచ్‌ గురించేమో అనుకుంటున్నారా.. అక్కడే కాదు. మన విశాఖ జిల్లాలోని పూడిమడక గురించే...

సందర్శకులను ఆకట్టుకునే అందాలు పూడిమడకలో సమీపంలో ఉన్నా ఇన్ని రోజులు వీటిని గుర్తించి అభివృద్ధి చేసే నాథుడు కనిపించకపోవడంతో జిల్లావాసులకు ఒక మంచి అందమైన తీరప్రాంతాన్ని అందించలేకపోయారు. ప్రముఖ పర్యటక కేంద్రం గోవాను తలదన్నే అందమైన తీరప్రాంతం పూడిమడక వద్ద ఉన్నా ఇన్ని రోజులుగా గుర్తించేవారు లేకుండాపోయారు. ఈ గ్రామాన్ని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ దత్తత తీసుకోవడంతో దీనిని పర్యటకంగా అభివృద్ధి చేయడానికి మొదటి అడుగు పడింది.

జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడక ప్రముఖ పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. పూడిమడకలో పర్యటక అభివృద్ధికి రూ. 52 కోట్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. జిల్లాలోనే అత్యంత ఆధునిక సదుపాయాలతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పర్యటక శాఖ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) శ్రీరాములనాయుడు, జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ, తెదేపా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లాలం భాస్కరరావు ఇప్పటికే పూడిమడకను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఉండాల్సిన లక్షణాలు, అవకాశాలను పరిశీలించారు. గోదావరి నది పాయలను పోలిన ఉప్పుటేరులో బోటుపై ప్రయాణంచేసి కాటేజీలు, హాటళ్లు నిర్మించే స్థలాలను, ప్రాంతాలను పరిశీలించారు. పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఉండాల్సి అన్ని రకాలైన అర్హతలు పూడిమడక తీరప్రాంతానికి ఉన్నాయని ప్రభుత్వానికి పర్యటక శాఖ నివేదిక కూడా అందించింది.


 
Tags:  andhra govva pudimadaka village vishaka district .
 

Related Stories