NEW DELHI MEDIA HOUSE
Breaking News

బాలాత్రిపుర సుందరీగా దుర్గమ్మ,.

Updated: Sunday 02,2016

విజ‌య‌వాడ‌: ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం దుర్గాదేవి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బాలాదేవి ఎంతో మహిమన్వితమైనది. శ్రీ బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది. అమ్మవారు త్రిగుణైక శక్తి, ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక. బాలాత్రిపుర సందరీదేవి శ్రీచక్రం మొదటి అమ్మాయిల్లో కొలువై ఉంటుంది. కాబట్టి ముందుగా బాలార్చన చేస్తారు. తర్వాత లలితాత్రిపురసుందరిని కొలుస్తారు. అభయ హస్తం, అక్షమాల ధరించిన బాలా రూపాన్ని ధరిస్తే మనో వికారాలు తొలిగిపోతాయి. త్రిపుర సుందరీ దేవి అభయహస్తముద్రతో చేతిలో అక్షరమాల ధరించి ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం ఆమె ఆధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం. బాలాత్రిపుర సుందరీ దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి ఎర్రని పూలతో పూజ చేసి కట్టెపొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు.


 
Tags:  KANAKA DURGA BALATRIPURA SUNDARI DASURA FESTIVAL VIJAYAWADA
 

Related Stories