NEW DELHI MEDIA HOUSE
Breaking News

టీమిండియా మరోసారి విజయం,.

Updated: Monday 03,2016

సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి విజయంతో నిరూపించుకుంది. న్యూజిలాండ్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ 178 పరుగుల తేడాతో గెలుపొంది మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

టీమిండియా బౌలర్ల ధాటికి 376 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 197 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ లాథమ్‌ (74: 148 బంతుల్లో 8×4), లూక్‌ రోంచి (32: 60 బంతుల్లో 4×4) భారత్‌ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించినా.. వారు కివీస్‌ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు. అంతకముందు కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా భారత్‌ 197 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయాలతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది


 
Tags:  team india won eden garden .
 

Related Stories