NEW DELHI MEDIA HOUSE
Breaking News

ధోనీ భార్యపై కేసు నమోదు,.

Updated: Wednesday 12,2016

భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఎమ్‌.ఎస్‌ ధోనీ భార్య సాక్షి ధోనీపై సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది.సాక్షి, అరుణ్‌ పాండే, శుభావతి పాండే, ప్రతిమ పాండేలు రితి ఎమ్‌ఎస్‌డీ అల్మోడే ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

వీరందరికీ ఈ కంపెనీలో సమాన షేర్లు ఉన్నాయి. అయితే గురుగ్రామ్‌కి చెందిన డెన్నిస్‌ అరోరా అనే వ్యక్తికి కూడా ఈ కంపెనీలో భాగంగా 39 శాతం షేర్ల వాటా ఉంది. కొన్ని కారణాల వల్ల అరోరా తన వాటాను ఓ ఒప్పందంపై ప్రస్తుత డైరెక్టర్లకు అమ్మేశాడు. ఒప్పందం ప్రకారం కంపెనీ డైరెక్టర్లు అరోరాకి రూ.11 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.2.25 కోట్లు మాత్రమే ఇచ్చారు.

మిగతా మొత్తం ఈ ఏడాది మార్చిలోనే ఇచ్చేయాల్సి ఉంది. కానీ సాక్షితో పాటు మిగతా డైరెక్టర్లు డబ్బు ఇవ్వలేదని అతనుఅందరిపై కేసు వేశాడు. సాక్షి మాత్రం ఈ విషయమై స్పందించ లేదు

 


 
Tags:  CRICKET BATSMAN DHONI WIFE BOOKED .
 

Related Stories