NEW DELHI MEDIA HOUSE
Breaking News

శ్రియ.. క్రికెటర్‌ బ్రావోతో ప్రేమలో ఉందా? !!.

Updated: Thursday 13,2016

శ్రియా శరణ్‌.. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కెరీర్‌ ప్రారంభించి ఇప్పటికీ కీలక పాత్రలను దక్కించుకుంటోంది. కెరీర్‌ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్‌ను మెయింటెన్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సుదర్ఘీ కెరీర్‌లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండా గడిపేసిన ఈ బ్యూటీ.. ఇన్నాళ్లకు ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, డ్యాన్సింగ్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో శ్రియ లవ్‌ట్రాక్‌ నడుపుతోందనే వార్తలు పుట్టుకొచ్చాయి. విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ భారత్‌ అంటే బ్రావోకు ఎంతో ఇష్టం. ఐపీఎల్‌తోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ, పాటలు పాడుతూ, ఓ హిందీ రియాల్టీ షోలో పాల్గొంటూ ఇండియాతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా శ్రియ, బ్రావో డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. ముంబై శివార్లలోని ఓ రెస్టారెంట్‌కు తరచుగా వెళ్తుంటారని తెలుస్తోంది. ఇటీవల వారిద్దరూ ఆ రెస్టారెంట్‌ నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కారు. ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్తున్నా వారు డోంట్‌కేర్‌ అన్నట్టు వ్యవహరించారు. దీనితో వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అది నిజమో, కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


 
Tags:  ACTRESS SREYA DATING WITH WESTINDIS CRICKETER BROVO ??.
 

Related Stories