NEW DELHI MEDIA HOUSE
Breaking News

భారీ బడ్జెట్ తో సప్తగిరి కామెడీ సినిమా !!.

Updated: Sunday 23,2016

కామెడీ హీరోతో సినిమా, అచ్చంగా కామెడీ సినిమా తీయడం అంటే ఖర్చు దగ్గర కాస్త బిగిస్తారు. ఎందుకంటే మార్కెట్ ఎలా వుంటుందో అని. కానీ కమెడియన్ సప్తగిరి తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమాకు ఆరు కోట్లు ఖర్చు పెట్టేసారు. విదేశాల్లో పాటలు కూడా తీసారు. సప్తగిరే స్వయంగా ఓ తమిళ రచయిత మూల కథను తీసుకుని, సినిమాకు అనుగుణంగా మార్చాడు . 

దాన్ని అవుట్ అండ్ అవుట్ ఫన్ తో తెరకెక్కించారు. కానిస్టేబుళ్ల ఉద్యోగాలు, వాటిలోని సాధకబాధకాలు, వాటిని కాస్త ఫన్ ఏంగిల్ లో చెప్పే ప్రయత్నమే సప్తగిరి ఎక్స్ ప్రెస్. ఈ సినిమాలో సప్తగిరి కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో టీజర్ విడుదల చేసి, వచ్చే నెలలో మంచి టైమ్ చూసుకుని సిన్మాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

త్రివిక్రమ్ సినిమాలకు అసిస్టెంట్ గా, విజువల్ ఎఫెక్ట్ విభాగంలో పనిచేసిన అరుణ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డాక్టర్ రవికిరణ్ నిర్మాత.


 
Tags:  TELUGU COMEDIAN SAPTAGIRI DEBUT AS HERO
 

Related Stories