NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఎన్ఆర్ఐ విదేశీ చట్టాల వల్ల పలు ప్రతిబంధకాలు .

Updated: Wednesday 02,2016

ఎన్ఆర్ఐ భర్తలు వదిలేసిన వారిలో అత్యధికంగా తెలంగాణాకు చెందిన 50 మంది మహిళలున్నారని తేలిందని మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం వెల్లడించారు. వరకట్నం వేధింపుల కేసులను అమెరికా, యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లోని కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదని త్రిపురాన వెంకటరత్నం ఆందోళన వ్యక్తం చేశారు.

వరకట్నం వేధింపుల కేసుల్లోఎన్ఆర్ఐ భర్తలను మన దేశానికి రప్పించడం కష్యసాధ్యంగా మారిందంటారామె. మన దేశానికి చెందిన భార్యలు విదేశాల్లో స్థిరపడిన భారతీయులను పెళ్లాడితే వారి మధ్య ఏర్పడిన కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి న్యాయపరంగా విదేశీ చట్టాల వల్ల పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని వెంకటరత్నం చెప్పారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైౖర్మన్‌ త్రిపురాన వెంకటరత్నం సూచించారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాలు చేసుకున్న వారు విదేశీ చట్టాల అమలుతో అన్యాయాని కి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశ హిందూ, ముస్లిం చట్టా ల ప్రకారం వివాహం చేసుకున్న వారికి విదేశాల్లో అక్కడి చట్టాల పేరుతో విడాకు లు మంజూరు చేస్తున్నారన్నారు.

మన దేశ వివాహ చట్టాల ప్రకారం వివాహం చేసుకున్న వారికి ఇతర దేశాల్లో అక్కడి చట్టాల ప్రకారం విడాకులు ఇచ్చే అధికారం ఉండదని అన్నారు. కానీ కొన్ని దేశాల్లో మంజూరు చేస్తున్నారని పేర్కొ న్నారు. ఎన్‌ఆర్‌ఐ వివాహాల విషయంలో అక్కడి దేశాలు విడాకులు మంజూరు చేయకుండా భారత మహిళా కమిషన్‌ చొరవ చూపాలన్నారు.

వివాహ చట్టాలపై అవగాహన కార్యక్రమా న్ని ఈ నెల 5న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు.


 
Tags:  MARRIAGE NRI DOWRY .TELEGANA.WOMEN COMMISSION T.VENKATA RATNAM
 

Related Stories