NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఇక్కడ నలుపు కూడా బంగార మాయెను !!.

Updated: Saturday 12,2016

నెల్లూరు: పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో బంగారం బిస్కెట్ల అమ్మకాలు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు బడాబాబులు రూ.వందలకోట్లలో బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకే షాపులో రూ.300కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు నుంచి మూడు రోజుల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి.

రూ.3.10లక్షలు విలువ చేసే బంగారు బిస్కెట్లను రూ.4.50లక్షలకు అమ్ముతున్నారు. ఒక్కో బిస్కెట్‌పై రూ.లక్షా50వేలు కమిషన్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నెల్లూరు పరిధిలోనే దాదాపు వెయ్యికోట్లకు పైగా బంగారు బిస్కెట్ల అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. చిన్న వ్యాపారులను సైతం బంగారు బిస్కెట్లు కావాలని బడాబాబులు అడుగుతుండటం చర్చనీయాంశమైంది.

నెల్లూరులో బంగారం కొనుగోళ్లపై ఐటీ, సెంట్రల్ ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. కొన్ని షాపుల్లో నిన్నటి నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ రెండు రోజులుగా జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. 


 
Tags:  CURENCY BLACK GOLD WHITE
 

Related Stories