NEW DELHI MEDIA HOUSE
Breaking News

వైట్ చేసుకునే పనిలో పడ్డారు ఖాకీలు !! .

Updated: Tuesday 15,2016

 

విశాఖపట్నం: నోట్ల రద్దు విశాఖ జిల్లాలోని బ్యాంకు మేనేజనర్లు, బంగారునగల వ్యాపారులకు తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. అదీ ఖాకీల నుంచి. నా దగ్గర ఇంత ఉంది...బిస్కెట్లు ఏమైనా సర్దుతారా అని ఒకరు, నా దగ్గర అంత ఉంది...మంచి డైమండ్ ఏదైనా సెట్ చేస్తారా అని ఇంకొకరు.
ఇలా ఏదోకటి ఇవ్వండి బిల్లు అక్కర్లేదని మరొకరు ఇచ్చాపురం నుంచి సీలేరు వరకు బంగారు నగల వ్యాపారులపై ఒత్తిడి వస్తోంది. బ్యాంకు మేనేజర్లకు తిప్పలు తప్పడం లేదు. బ్లాక్‌ను ఎలాగైనా వైట్ చేయండి కమిషన్ ఎంతైనా ఇస్తామని బతిమాలుతున్నారు. అవినీతితో అడ్డగోలుగా వెనకేసుకున్న సొత్తును వైట్ చేసుకునే పనిలో పడ్డారు ఖాకీలు.
 
నిజాయితీపరులైన అతికొద్ది మంది మినహా చాలా మంది అడ్డదారిలో సంపాదించి, బినామీల పేరిట ఆస్తులు కొన్నారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. మరికొందరు బంధువులు, మిత్రులు, కానిస్టేబుళ్ల వద్ద దాచారు. అలాంటి వాళ్లంతా ఇప్పుడా సొమ్మును బయటకు తీసి మార్చుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఉంచితే చెల్లకుండా పోతాయి. అందుకే నానా పాట్లు పడుతున్నారు. అందుకోసం వీలైనన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఓవైపు పోలీసులు ఒత్తిడి, మరోవైపు ఆదాయపు పన్నుశాఖ నిఘాతో బంగారం వ్యాపారుల పరిస్థితి అడకత్తరలో పోకచక్కలా మారింది.
తమను వేయి కళ్లతో గమనిస్తున్న ఐటీ అధికారులు కళ్లముందు మెదులుతున్నారు. దీంతో మేం మీకు సహకరించలేం...కొన్ని రోజులు ఆగండి చూద్దాం అంటున్నారు. బంగారం కాదు గానీ డైమండ్స్ వరకైతే కొంత సర్దుబాటు చేయగలుగుతామని మరికొందరు అంటున్నారు.
 
ఇక చిల్లరనోట్ల పంపిణీ, ఉన్నతాధికారుల ఆదేశాలు, సమావేశాలతో ఊపిరి సలపని పనిలో ఉన్న బ్యాంకు అధికారులు ఖాకీల కాల్స్‌తో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడలా కుదరదు, ప్రతీ నోటుకు లెక్కచెప్పాలి అని మొహం మీదే చెప్పేస్తున్నారు కొందరు.

 


 
Tags:  POLICE CURRECY GOLD BLACK MONEY.
 

Related Stories