NEW DELHI MEDIA HOUSE
Breaking News

‘కాఫీ విత్‌ కరణ్‌’ షో కత్రినా సల్లూభాయ్‌.

Updated: Thursday 17,2016

సల్మాన్‌ఖాన్‌.. కత్రినాకైఫ్‌ కొన్నాళ్ల క్రితం విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత కత్రినా.. రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమలో పడింది.

ఏం జరిగిందో తెలీదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ విషయంపై బాలీవుడ్‌లో కొన్నాళ్లపాటు చర్చలు జరిగాయి. అయితే ఆ పరిస్థితుల్లో కత్రినాకు సల్మాన్‌ అండగా నిలిచారు.

ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో కత్రినాకు సలహాలు, సూచనలు కూడా ఇచ్చాడు. అంతేకాదు.. ‘ఫితూర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా కత్రినా ఓ షోకి వెళ్తే.. అక్కడ సల్మాన్‌ చెప్పకుండానే ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మరో షోకి సల్మాన్‌.. కత్రినా కలిసి రాబోతున్నారట.

బాలీవుడ్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో చాలా

పాపులారిటీ సంపాదించింది. నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే షారుక్‌ ఖాన్‌ సహా పలువురు బాలీవుడ్‌ నటులు ఈ షోలో పాల్గొన్నారు.

అయితే ఈ షోకి త్వరలో మాజీ ప్రేమికులైన సల్మాన్‌ఖాన్‌.. కత్రినాకైఫ్‌ రాబోతున్నారని బీటౌన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ షోలో పాల్గొనేందుకు ఇద్దరూ అంగీకారం తెలిపారని.. ఇప్పటికే వారిపై ఒక ఎపిసోడ్‌ చిత్రీకరణ జరిగిందని అంటున్నారు.

ఇక ఇద్దరు కలిసి వస్తే అది బాలీవుడ్‌లో మరో హాట్‌ టాపిక్‌గా మారటం ఖాయం.


 
Tags:  CAFE WITH KARAN SHOW ACTERSS KATRINA SALMAN .
 

Related Stories