NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఖాకీ యూనిఫాం లేని పోలీసు : డీజీపీ

Updated: Tuesday 13,2016

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు తక్కువ సిబ్బందితో ఎక్కువ పోలీసింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరులో నిర్మిస్తున్న రెండు ఆదర్శ పోలీస్‌ స్టేషన్ల పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

ఖాకీ యూనిఫాం లేని పోలీసు సిబ్బంది సంఖ్యను తగ్గించి పోలీసింగ్‌ను పెంచాలని సీఎం సూచించారని, ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టిన కమ్యూనిటీ పోలీసింగ్‌ విజయవంతమైందని చెప్పారు.

‘కమ్యూనిటీ పోలీసింగ్‌ అంటే ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు పోలీసుల విధుల్లో భాగం పంచుకోవడమే! చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌ ఈ విధానాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఆసక్తిఉన్న ప్రజలను ఎంపిక చేసి.. వారిని క మ్యూనిటీ పోలీసింగ్‌ఆఫీసర్లు (సీపీవో)గా గుర్తిస్తాం. చిత్తూ రు జిల్లాలో 2,500 మంది పోలీసులు ఉంటే సీపీవోలు 4 వేలమంది వరకు ఉన్నారు.ఇప్పుడు ఈ విధానాన్ని నెల్లూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నాం.

వారంలోగా మొదలయ్యేలా చర్య లు తీసుకుంటాం. సీపీవోలను ట్రాఫిక్‌, జాతరలు, ఉత్సవాల వద్ద, రాత్రి గస్తీ, వంటి విధులకు వినియోగించుకుంటాం. బీటెక్‌ విద్యార్థులకు ఆసక్తి ఉంటే పోలీస్‌ స్టేషన్లలో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా వారి సేవలను వినియోగించుకుంటాంఅని తెలిపారు.

సీపీవోలు అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 14వేల కానిస్టేబుల్‌ పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని, ప్రస్తుతం 5,650 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పోలీసులకు నూతన విధానంలో పోలీసింగ్‌పై శిక్షణ ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌పీఆర్‌బీ) బోర్డు అత్యంత అబ్జెక్టివ్‌ బోర్డుగా పేరు గడించిందని స్పష్టం చేశారు. సిబ్బంది నియామకాలకు తమ బోర్డునే చాలా విభాగాలు సంప్రదిస్తున్నాయన్నారు.

పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు తమ దృష్టికి వస్తే ఐటీశాఖకు తెలియజేస్తామని, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అని అడిగే హక్కు ఆదాయ పన్ను శాఖకే ఉందన్నారు.


 
Tags:  WITH OUT POLICE UNIFORM DGP SAMABASIVARAO.
 

Related Stories