NEW DELHI MEDIA HOUSE
Breaking News

ప్రతి ఇంట్లో ఓ కూచిపూడి నృత్యకారిణి ఉండాలి .

Updated: Friday 23,2016

విజయవాడ: కూచిపూడికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడలో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనానికి చంద్రబాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన కళాకారులను అభినందిస్తున్నానన్నారు. కళాకారులను ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని తెలిపారు. కూచిపూడి నృత్యానికి పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
కూచిపూడి నాట్యారామం ఏర్పాటు చేస్తామని, కూచిపూడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. చరిత్రను మర్చిపోతే ఉనికిని కోల్పోతామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.
 
ప్రతి ఇంట్లో ఓ కూచిపూడి నృత్యకారిణి ఉండాలని ఆకాంక్షించారు. పేద కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నామని, ఇబ్బందుల్లో ఉన్న కూచిపూడి గురువులను ఆదుకుంటామని అభయమిచ్చారు. లండన్ మ్యూజియంలో అమరావతి చరిత్ర ఆనవాళ్లు ఉన్నాయని, భవిష్యత్‌లో అమరావతి కల్చరల్ క్యాపిటల్‌గా ఉంటుందని...ఇందుకోసం ప్రణాళిక తయారు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజులపాటు నృత్య సమ్మేళనం జరుగనుంది.


 
Tags:  INTERNATIONAL KUCHIPUDI DANCE CHANDRABABU .
 

Related Stories