NEW DELHI MEDIA HOUSE
Breaking News

కులిన సైనిక విమానం!

Updated: Tuesday 11,2017

మిస్సిస్సిపీ: అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం మిస్సిస్సిపీ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ఉన్న మొత్తం 16 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానం కూలిన అనంతరం శకలాలు కొన్ని మైళ్ల దూరం వరకూ పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు

లెఫ్లోర్‌ కౌంటీలో తీరప్రాంత గస్తీదళానికి చెందిన కేసీ-130 రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వినియోగిస్తున్నారు. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 12 మృతదేహాలను గుర్తించారు. మిగతా మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనను అమెరికా నావికాదళం ధ్రువీకరించింది. అయితే పూర్తివివరాలను వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


 
Tags:  Military plane crashes in Mississippi.16 dead. 
 

Related Stories