NEW DELHI MEDIA HOUSE
Breaking News

డ్రగ్స్‌ వ్యవహారంలోకాజల్‌ మేనేజర్‌ అరెస్టు .

Updated: Monday 24,2017

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్‌ వ్యవహారంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులను రోజుకొకర్ని చొప్పున ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు గంటలతరబడి విచారిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా సినీనటి కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్‌ రోనీని పోలీసులు అరెస్టుచేశారు. గంజాయి కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రోనీ నివాసం నుంచి గంజాయిని సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రోనీ ప్రముఖ సినీ తారలు రాశిఖన్నా, లావణ్య త్రిపాఠిలకు కూడా గతంలో మేనేజర్‌గా పనిచేశాడు.



 
Tags:  ACTRESS KAJOL MANGER ARRESTED DRUG CASE.
 

Related Stories