NEW DELHI MEDIA HOUSE
Breaking News

బాబోయ్ బంగారు బాబా..!!!

Updated: Monday 24,2017

బంగారం అంటే మక్కువ ఎవరికి ఉండదు? మరికొందరికయితే అది మరీ ఎక్కువ ఈ కోవకు చెందిన వ్యక్తే ఆ బాబా...బాబాకు, బంగారానికి సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి... ఆయన పేరు సుధీర్ మక్కర్. బంగారు బాబా అంటే చాలామంది టక్కున గుర్తుపడతారు. ఆయన ఒళ్లంతా బంగారమే.

14.5 కిలోల ఆభరణాలతో దర్శనమిస్తుంటారు. హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు 200 కిలోమీటర్లు జరిగే కన్వర్ యాత్రలో ప్రతి ఏటా ఆయన పాల్గొంటారు. గత ఏడాది 12.5 కిలోల ఆభరణాలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. ఈసారి మరో 2 కేజీలు ఎక్కు పసిడి ధరించి కనిపించారు. 21 బంగారు చైన్లు, దేముడి లాకెట్లు ఉన్న మరో 21 ఆభరణాలు ఎప్పుడూ ధరిస్తుంటారు. అప్పుడప్పుడు బంగారు జాకెట్‌ను ధరించి, 16 మంది మోటారు సైకిళ్లపై తోడుగా వస్తుంటే ఆయన ర్యాలీగా వెళుతుంటారు.

బంగారు బాబాకు రోలెక్స్ వాచీ, ఒక బీఎండబ్ల్యూ, రెండు ఆడి కార్లు, 3 పార్చూనర్లు ఉన్నాయి. ఈయన ధరించే బంగారంలో శివుడి లాకెట్‌తో కూడిన చైన్ 2 కేజీల బరువు ఉంది. 2018లో చివరి యాత్ర చేస్తానంటున్న పసిడి బాబా..అది తన 25వ యాత్ర అవుతుందని అన్నారు.


 
Tags:  GOLDEN BABHA  INDIA GOLD WEARING 3 RS CRORES
 

Related Stories