NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి : చంద్రబాబు.

Updated: Monday 22,2018

ఆంధ్రప్రదేశ్‌లో  ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు, సరుకు రవాణా సులభతరం అవుతుందని వివరించారు.

దావోస్ పర్యటనలో భాగంగా జురిచ్‌‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం వెంటనే తమ కార్యక్రమాలను ప్రారంభించింది. పయనీరింగ్ వెంచర్స్ ఛైర్మన్‌ రాన్ పాల్‌తో తొలి ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంది.

 ఇప్పటికే కుప్పం, నాందేడ్‌లలో వ్యవసాయం,  వ్యవసాయాధారిత స్లపయి చైన్‌ బెజినెస్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తోన్న ఆ సంస్థ ఛైర్మన్‌తో భేటీ అయింది.  ఆ సంస్థ విస్తరణకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

 ఈ సంస్థతో సంప్రదింపులు జరిపి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పరిశ్రమల శాఖ కార్యదర్శికి చంద్రబాబు సూచించారు. పండ్ల తోటలు, పాడి పరిశ్రమలో ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని.. రానున్న ఐదేళ్లలో 5000 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు వివరించారు.

పూర్తి స్థాయి ప్రణాళికతో వచ్చి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. ముఖ్యమంత్రితో పాటు సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, యనమల రామకృష్ణుడు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ఉన్నారు.


 
Tags:  INVEST AP CHANDRABABU DAVOS
 

Related Stories