NEW DELHI MEDIA HOUSE
Breaking News

యాంటిబయోటిక్‌ కాస్త జాగ్రత్తగా ! ?? .

Updated: Monday 05,2018

మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో యాంటిబయోటిక్‌ మందులను వాడుతుంటాం. అయితే ఈ సారి నుంచి వాటిని వేసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే మన దేశంలో దొరుకుతున్న యాంటిబయోటిక్‌లలో 64శాతం నకిలీవేనట. వాటిని విక్రయించేందుకు ఎలాంటి అనుమతులు లేవట. యూకే నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా యాంటిబయోటిక్‌ మందుల వినియోగంపై లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ, న్యూక్యాసిల్‌ యూనివర్శిటీలోని పరిశోధకులు సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టారు. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఫార్మకాలజీలో ఈ అధ్యయనాన్నిప్రచురించారు. దీని ప్రకారం.. భారత మార్కెట్లో లక్షల సంఖ్యలో విక్రయిస్తున్న యాంటిబయోటిక్‌ మందులకు ఎలాంటి అనుమతులు లేనట్లు తెలిసింది. 2007 నుంచి 2012 మధ్య భారత్‌లో 118 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎఫ్‌డీసీ) ఫార్ములేషన్స్‌ను గుర్తించారు. అయితే ఇందులో 64శాతం మందులకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీవో) నుంచి ఎలాంటి అనుమతులు లేవని వెల్లడైంది. అనుమతిలేని కొత్త మందులను విక్రయించడం, సరఫరా చేయడం భారత్‌లో చట్టవ్యతిరేకం అయినప్పటికీ.. ఈ మందులను యథేచ్ఛగా అమ్ముతున్నట్లు తెలిసింది.

ప్రపంచవ్యాప్తంగా యాంటిబయోటిక్‌ మందులను అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. దేశంలో 3,300 బ్రాండ్ల పేర్లతో ఎఫ్‌డీసీ యాంటిబయోటిక్స్‌ విక్రయమవుతున్నాయి. వీటిని 500 ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఇందులో 12 బహుళజాతి సంస్థలు కూడా ఉన్నాయి.


 
Tags:  ANTI-BIOTICTS 64 % spourious study.
 

Related Stories