NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌ హబ్‌ : చంద్రబాబు

Updated: Wednesday 11,2018

తిరుపతి : సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన షియామి సంస్థ ఏపీలో తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

తిరుపతిలోని ఓ హోటల్‌లో షియామి సంస్థతో పాటు ఆ సంస్థకు విడిభాగాలను సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఫాక్స్‌కాన్‌, డిక్సన్‌, సెలకాన్‌ వంటి సెల్‌ఫోన్‌ పరిశ్రమలతో ఇరవై వేల మంది ఉపాధి పొందుతున్నారని.. షియామి వంటి సంస్థల ద్వారా మరో 20 వేల మందికి ఉపాధి వస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కలిగే ప్రయోజనాలు...రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులపై పారిశ్రామిక వేత్తలకు వివరించానన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. భవిష్యత్‌లో ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.

 


 
Tags:  AP HARD WEAR HAB CHANDRABABU .
 

Related Stories