NEW DELHI MEDIA HOUSE
Breaking News

విజయవాడలోమల్టీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు .

Updated: Wednesday 27,2018

 

విజయవాడలోని ఏఎం ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యంతర డీపీఆర్‌పై విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశానికి జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ ‘కేఎఫ్‌డబ్ల్యూ’ టెక్నికల్‌ బృందం కూడా పాలు పంచుకుంది. ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డితో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయ క్రిష్ణన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జె నివాస్‌ తదితర ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న శిస్ర్టా ప్రతి నిధు తమ మధ్యంతర రిపోర్టును సమావేశం ముందుంచారు.
ప్రధానంగా మూడు కారిడార్లను ప్రతిపాదించారు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిడమానూరు, ఏలూరు రోడ్డు, రైల్వేస్టేషన్‌, పీఎన్‌బీఎస్‌, కృష్ణాకెనాల్‌ జంక్షన్‌, రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేరేలా ఒక కారి డార్‌, జక్కంపూడి నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు కారిడార్‌కు అను సంధానమయ్యేలా రెండవ కారిడార్‌ను, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ నుంచి పెన మలూరు సెంటర్‌ వరకు మూడవ కారి డార్‌ను ప్రతిపాదించారు.
ఈ కారిడార్లకు సంబంధించి మొదటి దశలో విజయవాడ ఎయిర్‌పోర్టు - పీఎన్‌బీఎస్‌, పీఎన్‌బీఎస్‌ - పెనమలూరు వంటివి ప్రతి పాదించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ జోక్యం చేసుకుని మొదటి దశలోనే అమరావతికి అనుసంధానం చేసేలా డీపీఆర్‌లో పొందుపరచాలని సూచించారు. ఆ తర్వాత ఎలాంటి రవాణా వ్యవస్థ అవసరమన్న దానిపై చర్చకు వచ్చింది.
 
బందరు రోడ్డు విస్తరణ వల్ల సువిశాల రహదారి అందుబాటులోకి రావటం వల్ల ఎర్త్‌ గ్రేడ్‌ విధానంలో నేలపై ట్రాములు నడిచే విధంగా మెట్రో లైన్‌ వెళ్లటం వల్ల కిలో మీటర్‌కు రూ.100 కోట్లు కలిసి వస్తుందని నిపుణుల కమిటీలో తేలింది. మెట్రో ప్రాజెక్టులు దేశంలో లాభంలో లేకపోవటానికి ముందు అనుకున్నంతగా త ర్వాత ప్రయాణికులు రాకపోవటమేనని గుర్తించారు. హైదరాబాద్‌ మెట్రోకు 7 లక్షల మంది ప్రయాణికులు వస్తారని ఊహిస్తే సగటున 60 వేల మంది కూడా రావటం లేదన్న దానిపై చర్చ నడిచింది. విజయవాడలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాసెంజర్స్‌, ట్రాఫిక్‌ సర్వేలో వచ్చిన ప్రకారం ప్రయాణికుల అవసరాలే ప్రాతిపదికగా మెట్రో ఉండాలని నిర్ణయించారు.
ఈ దిశగా ఎక్కడ ఎలివేటెడ్‌ ఉండాలి? ఎక్కడ భూమిపై ఉండాలి? అన్న అంశాలను పరిశీ లించాలని శిస్ర్టాకు కరికాల వలవన్‌ సూచించారు. జక్కంపూడి కారిడార్‌కు ప్రాథమికంగా కారిడార్‌ అవసరమేనని అభిప్రాయపడినా ఎకనమిక్‌ సిటీ అభివృద్ధి చెందటానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి దానిని రెండవ ఫేజ్‌లో చేర్చాలని నిర్ణయించారు. పీఎన్‌బీఎస్‌ నుంచి పెన మలూరు సెంటర్‌ కారిడార్‌ను కూడా మొదటి ఫేజ్‌లోనే చేపట్టేందుకు ఉన్నతస్థాయి కమిటీల ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.

 


 
Tags:  MALLTY METRO RAIL VIJAYAWADA.
 

Related Stories