NEW DELHI MEDIA HOUSE
Breaking News

బెంగళూరులో ‘హెలీ’ట్యాక్సీలు!

Updated: Monday 02,2018

బెంగళూరు: నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ-కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య బాడుగ హెలికాప్టర్‌ సేవలు విజయవంతంగా ఆరంభం కావటంతో స్ఫూర్తిపొందిన బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె బాధ్యులు నాలుగు చోట్ల హెలీపాడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

కీలకమైన జనావాసాలున్న బెల్లహళ్లి, బింగిపుర, మైలసంద్ర, బాగలూరు వద్ద వీటి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. పాలికెనే సొంతంగా హెలిపాడ్లను నిర్మించి, నిర్వహించదు. వాటి నిర్మాణానికి కావాల్సిన భూమిని నెలవారీ బాడుగ ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో పాలికె కేటాయిస్తుంది. ప్రైవేటు సంస్థలు లేక వ్యక్తులు అక్కడ హెలిపాడ్‌ నిర్మించి, నిర్వహణ బాధ్యతల్ని కూడా చేపట్టాలి. ప్రాథమిక దశలో హెలి అంబులెన్స్‌ సేవలకు పరిమితంగా వాటిని వినియోగిస్తారు. మలిదశలో వాణిజ్య సరళిలో హెలికాప్టర్లు నడుపుతారని బెంగళూరు అభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. నగరంలో ప్రస్తుతం ప్రైవేటు భవనాలపై 50 వరకూ హెలిపాడ్‌లు ఉన్నాయి. పౌర విమానయాన శాఖ అనుమతి లభించకపోవటంతో అవి మూలన పడినట్లయ్యింది. ఎలక్ట్రానిక్‌సిటీ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య హెలికాప్టర్లో ప్రయాణ వ్యవధి 15 నిమిషాలు. ఇందుకు చెల్లించాల్సిన రుసుము రూ.3,000 నుంచి రూ.3,500. తాము సేవలు ప్రారంభిస్తే ఆ రుసుము అంతకంటే తక్కువగా ఉంటుందని పాలికె ఉన్నతాధికారులు చెప్పారు.


 
Tags:  helicopter taxies bengaluru
 

Related Stories