NEW DELHI MEDIA HOUSE
Breaking News

అసత్య వీడియోల హల్‌చల్‌ అడ్డుకట్ట ?! .

Updated: Tuesday 10,2018

వాట్సాప్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. మెస్సేజ్‌లు, ఫోన్‌కాల్స్‌, వీడియోకాల్స్‌ అన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌ వాట్సాప్‌. ఇక గ్రూపుల్లో ఉండే వారి సంగతి గురించి ప్రత్యేక చెప్పనవసరం లేదు. కొందరు మంచి విషయాలను పంచుకుంటే, ఇంకొందరు తమ మొబైల్‌కు వచ్చిన ప్రతి మెస్సేజ్‌ను గ్రూపులో పంచుకుంటూ ఇబ్బంది కలిగిస్తారు.

ఇక ఇటీవల కాలంలో అబద్ధపు వార్తలు, అసత్య వీడియోల హల్‌చల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని రోజుల క్రితం వాట్సాప్‌లో తెగచక్కర్లు కొట్టిన ఓ వీడియో 30మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇలాంటి మెస్సేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఓ ఫీచర్‌పై కూడా వాట్సాప్‌ పనిచేస్తోంది. ‘ఈ లింక్‌పై క్లిక్‌ చేస్తే మీకు బహుమతి లభిస్తుంది’ అంటూ వచ్చే సందేశాలకు వాట్సాప్‌లో కొదవలేదు. పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే, మనం సైబర్‌ నేరగాళ్ల బారిన పడినట్లే. ఇక మన ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు వారి గుప్పెట్లోకి వెళ్లిపోతాయి. ఫొటోలు, వీడియోలే కాదు మన ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, ఓటీపీలు వారికి తెలిసిపోతాయి. త్వరలో అందుబాటులోకి వచ్చే ఫీచర్‌తో ఈ మెస్సేజ్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి మెస్సేలు వచ్చినప్పుడు వాట్సాప్‌లో హెచ్చరిక సందేశం వస్తుంది. గుర్తుతెలియని నెంబర్‌ నుంచే కాదు, మన స్నేహితులు తెలియకుండా పంపిన లింకులు మన వాట్సాప్‌కు వస్తే, అనుమానాస్పద లింకు(Suspicious Link) అని ఎరుపు రంగులో ఆ మెస్సేజ్‌పై వస్తుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ పరీక్షిస్తోంది. అనుమానాస్పద మెస్సేజ్‌లు వస్తే, వెంటనే వాటిని డిలీట్‌ చేసే వీలుంటుంది. దీని వల్ల ఫోన్‌ మాల్వేర్‌ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలు వాట్సాప్‌ వెర్షన్‌ 2.18.204లో లభించాయి. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వాట్సాప్‌ కృషి చేస్తోంది. ఇతర గ్రూప్‌ల నుంచి ఉన్నది ఉన్నట్లు వచ్చే మెస్సేలకు సైతం ‘ఫార్వర్డ్‌ మెస్సేజ్‌’ అని చూపిస్తుంది.


 
Tags:  Suspicious Link STOP WHATS UP.
 

Related Stories