NEW DELHI MEDIA HOUSE
Breaking News

రజనీ భార్యకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!

Updated: Tuesday 10,2018

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రజనీ నటించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి కర్ణాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది.

ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రజనీ నంటించిన కొచ్చాడయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్.. బెంగళూరుకు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి రూ.10 కోట్ల రుణం తీసుకుంది. ఈ రుణాన్ని మీడియా ఒన్ గ్లోబల్ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్ హామీ మేరకు ఇవ్వడం జరిగింది. అయితే తీసుకున్న మొత్తం రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్ బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించారు. వడ్డీ సహా రూ. 6.20 కోట్ల మిగతా రుణాన్ని చెల్లించలేదు. దీంతో యాడ్‌బ్యూరో సంస్థ లతా రజనీకాంత్‌పై కర్ణాకటలో కేసు పెట్టారు


 
Tags:  ACTOR RAJANI WIFE SUPRME COURT SHOCK
 

Related Stories