NEW DELHI MEDIA HOUSE
Breaking News

జగన్ మీద జలీల్ ఖాన్ కూతురు పోటీ ?! .

Updated: Tuesday 10,2018

విజయవాడ: 25ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు భాజపా అధ్యక్షుడు అయ్యారని విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ ఆరోపించారు. వైకాపా అధినేత జగన్ రాష్ట్రానికి సైతాన్‌లా తయారయ్యారని మండిపడ్డారు. తనను తాను రక్షించుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని అన్నారు.

ఇసుక గురించి నోటికి వచ్చినట్టు జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ శాసనసభకు రాకుండా, ప్రభుత్వం గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. పాదయాత్రకు జనం వస్తే గెలిచినట్టు కాదు, వైకాపాకు మళ్ళీ 67 సీట్లు వస్తే ఏ శిక్షకైనా తాను సిద్ధమని సవాల్‌ విసిరారు.

 


 
Tags:  YSRCP JAGAN JALALILL KHAN DAUGHTER CONTEST
 

Related Stories