NEW DELHI MEDIA HOUSE
Breaking News

ట్రంప్‌పై కారు డ్రైవర్‌ కేసు .

Updated: Tuesday 10,2018

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరొకరు కోర్టులో కేసు వేశారు. ట్రంప్‌ కారు డ్రైవర్‌ అయిన నోయిల్‌ సిన్ట్రన్‌(59) న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.ట్రంప్‌ కారు డ్రైవర్‌అయిన నోయిల్‌ సిన్ట్రన్‌(59) న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గత 20 సంవత్సరాల నుంచి అధిక సమయం పని చేసినందుకు తగిన వేతనం చెల్లించలేదని స్ట్రినన్‌ ఆరోపించాడు. తాను ట్రంప్‌ దగ్గర పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వార్షిక వేతనాన్ని రెండేసార్లు పెంచినట్లు పేర్కొన్నాడు. 2003లో తొలిసారి 62,700 డాలర్లకు, 2010లో మరోసారి 75,000 డాలర్లకు మాత్రమే పెంచినట్లు సిన్ట్రన్‌ తన పిటిషన్‌లో వివరించాడు. 7,000డాలర్ల వేతనం పెంచాలంటే ట్రంప్‌ కార్యాలయం సమకూర్చే ఆరోగ్య బీమా వదులుకోవాలని మెలిక పెట్టినట్లు వాపోయాడు. ఉదయం 7 గంటల నుంచి ఎంత రాత్రైనా ట్రంప్‌ కుటుంబ సభ్యుల పనులు ముగిశాకే ఇంటికి వెళ్లేవాడినని తెలిపాడు. అలా వారానికి దాదాపు 50 పని గంటలు అదనంగా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

న్యూయార్క్ నిబంధనల ప్రకారం ఒక గంట అదనంగా పనిచేస్తే గంటన్నర వేతనాన్ని చెల్లించాలి. ట్రంప్‌ మాత్రం తనకు నిర్ణయించిన వేతనాన్నే చెల్లించేవారు తప్ప అదనపు పని గంటలకు ఏమీ చెల్లించలేదని స్ట్రినన్‌ ఆరోపించాడు. మొత్తం అదనపు పని గంటలకుగాను 2,00,000 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఈ మొత్తానికి వడ్డీ, లేటుగా చెల్లిస్తున్నందుకు జరిమానా, న్యాయవాది ఫీజుతో కలిపి 3,50,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రెండు కోట్ల 40 లక్షల 68వేల రూపాయలు) చెల్లించాలంటూ సిన్ట్రన్ తన‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు. సిన్ట్రన్‌ తరపు న్యాయవాది లార్రీ హచ్చర్‌ మాట్లాడుతూ... ‘‘ట్రంప్‌ కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు అదనపు పనిగంటల వేతనం చెల్లించకపోవడం, వేతన సవరణ గురించి అడిగినప్పుడల్లా సాధ్యంకాదని చెప్పడంతో సిన్ట్రన్‌ కోర్టును ఆశ్రయించారు’’ అని తెలిపారు. స్ట్రినన్‌ ఆరోపణలపై ట్రంప్‌ కార్యాలయ ప్రతినిధి అమేండా మిల్లర్‌ బదులిస్తూ...‘‘సిన్ట్రన్‌కు నిబంధనల ప్రకారమే వేతనాన్ని చెల్లించాము. నిజానిజాలు బయటపెట్టి కోర్టు నుంచి త్వరలోనే క్లీన్‌ చిట్‌ అదుకుంటాము’’ అని తెలిపారు.



 
Tags:  USA PRESIDENT TRAMP DRIVER.CASE .
 

Related Stories