NEW DELHI MEDIA HOUSE
Breaking News

విజయవాడ పోలీస్‌బాస్‌ ద్వారకా తిరుమలరావు.

Updated: Wednesday 18,2018

విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్‌బాస్‌లను నియమించింది. విజయవాడకు సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, విశాఖపట్నానికి మహేష్‌చంద్ర లడ్డాలకు పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించింది.

ఏలూరు రేంజి డీఐజీగా టి.రవికుమార్‌ మూర్తిని నియమించింది. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన గౌతమ్‌ సవాంగ్‌ ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ అయినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఆగస్టు నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న టి.యోగానంద్‌ తనను అక్కడ నుంచి బదిలీ చేయమని విన్నవించుకున్నారు.

దీంతో ఈ రెండు నగర కమిషనరేట్లకు కొత్త బాస్‌లను నియమించారు. వీరితో సహా రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అయితే సీఐడీ, ఏసీబీ విభాగాధిపతులగా ఇంకా ఎవర్నీ నియమించలేదు. మరికొంతమంది ఐజీలు, డీఐజీల బదిలీలు కూడా చేపట్టాల్సి ఉంది. మంగళవారం బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.


 
Tags:  9 IPS OFFICERS RESHUFFLE AP.
 

Related Stories