NEW DELHI MEDIA HOUSE
Breaking News

అమరావతి అత్యుత్తమ స్మార్ట్‌ నగరా .

Updated: Wednesday 18,2018

రాజధానిని దేశంలోని అత్యుత్తమ స్మార్ట్‌ నగరాల్లో ఒకటిగా రూపొందించే లక్ష్యంతో ఏపీసీఆర్డీయే చురుగ్గా చర్యలు గైకొంటోంది. నగరవాసులకు ప్రపంచస్థాయి మౌలిక వసతులను అందుబాటులోకి తేవడం ద్వారా వారు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని సాగించేలా చూసేందుకు ఏర్పాటు చేసిన అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎ.ఎస్‌. ఎస్‌.సి.సి.ఎల్‌.)ఈ దిశగా ముందుకు సాగుతోంది.
వ్యర్థాల నిర్వహణ, రహదారులు, ప్రజా రవాణా, ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌, ఇంధన సామర్ధ్య వ్యవస్థలతోపాటు ప్రభుత్వ సేవలను పౌరులకు శీఘ్రంగా అందజేయడం, వారి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ సంస్థకు చెందిన అధికారులు, నిపుణులు చర్చలు సాగిస్తున్నారు.
 
గతేడాది అక్టోబర్‌లో ఏర్పాటైనప్పటి నుంచి అమరావతిని స్మార్ట్‌ సిటీగా మలచాలంటే ఏం చేయాలనే దానిపై మేథోమధనం జరుపుతున్నారు. ఒకపక్క స్మార్ట్‌ సిటీలకు సంబంధించిన సకల అంశాలపై దృష్టిని సారిస్తూనే మరొకపక్క ప్రాధాన్యతాక్రమంలో ముందుగా పనులు చేపట్టాల్సిన వాటిని గుర్తిస్తున్నారు. ఇందుకోసం మొదటిగా వ్యర్థాల నిర్వహణ, ప్రజా రవాణా, ఇంధన పొదుపు, సిటిజన్‌ ఫ్రెండ్లీ గవర్నెన్స్‌ వంటి వాటిపై తొలుత సంప్రదింపులు జరుపుతున్నారు.


 
Tags:  AMATAVATI AP SMART CITY.
 

Related Stories