NEW DELHI MEDIA HOUSE
Breaking News

ఏపీకి సెంట్రల్ వర్సిటీ .

Updated: Wednesday 18,2018

ఏపీకి తీపి కబురు అందించింది కేంద్రం. రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పిన కేంద్రం.. అందులో భాగంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.

ఇప్పటికే మంగళగిరి దగ్గర ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోంది. తాజా కేంద్రమంత్రుల పర్యటన మొదలుకొని.. ముఖ్యమైన బిల్లుల ఆమోదం వరకు అన్నీ ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. గత వారం కేంద్రమంత్రి గడ్కరీ.. పోలవరం, విశాఖ పోర్టు పనులను సమీక్షించి వెళ్లారు. మరో కేంద్రమంత్రి జేపీ నడ్డా మంగళగిరి వచ్చి వెళ్లారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల పట్ల సానుకూలంగా ఉన్నామనే సంకేతాలిస్తోంది కేంద్రం.


 
Tags:  CENTRAL UNIVERSITY AP CENTRAL GOVT BILL PASSED.
 

Related Stories