NEW DELHI MEDIA HOUSE
Breaking News

కేంద్ర సమాచార కమిషన్‌ ద్విభాషా మొబైల్‌ యాప్‌

Updated: Wednesday 18,2018

 ఆర్టీఐ కార్యకర్తలు ఇక నుంచి తమ అభ్యర్థనలను హిందీ, ఇంగ్లి్‌షలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ద్విభాషా మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హిందీలో అప్‌డేట్‌ చేసిన మొబైల్‌ అప్లికేషన్‌ యాప్‌ను సీఐసీ ప్రారంభించిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాప్‌తో ఆర్టీఐ దరఖాస్తుదారులు తమ రెండో అభ్యర్థనలను దరఖాస్తు చేసి, వాటికి సంబంధించిన కాపీలను హిందీ, ఇంగ్లి్‌షలో లింక్‌ చేయవచ్చు. గూగుల్‌, యాపిల్‌ ప్లేస్టోర్‌ల నుంచి ఈ యా ప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఉపయోగించి హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చని ఒక అధికారి వెల్లడించారు.


 
Tags:  CENTRAL INFORMATION COMMISSION DUAL LANGUAGES .MOBILE APP.
 

Related Stories