NEW DELHI MEDIA HOUSE
Breaking News

జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 30శాతం రాయితీ.

Updated: Wednesday 18,2018

న్యూదిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వినియోగదారులకు 30 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు దేశీయ, అతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనున్నాయి. ఈ ఆఫర్‌ జులై 23వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.

ఈ విషయాన్ని జెట్‌ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో ఈ విమానం ఎకానమీ, ప్రీమియం‌ క్లాస్‌ల్లో ఛార్జీల ఆధారంగా ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. దీంతోపాటు సంస్థకు యూరోప్‌లో భాగస్వాములైన ఎయిర్‌ ఫ్రాన్స్‌, కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌లో విమానాల్లో ఈ ఆఫర్‌ లభించనుంది.

టొరెంటోకు వెళ్లే సర్వీసుల్లో, కోల్‌కతా నుంచి ఢాకా వెళ్లే వన్‌వే సర్వీసుల్లో ఈ డిస్కౌంట్‌ వర్తించదని పేర్కొంది. జులై 17 నుంచి జరిగే ప్రయాణాలపై ఈ ఆఫర్‌ వర్తించనుంది. కానీ మాంఛెస్టర్‌కు బుక్‌ చేసుకునే ప్రయాణాలకు మాత్రం నవంబర్‌ 5 తర్వాత నుంచి వర్తిస్తుంది. ఇక దేశీయ ప్రయాణాల్లో మాత్రం ఎకానమీ క్లాస్‌లో 25శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు.


 
Tags:  JET AIRWAYS 30% FAIR DISCOUNT.
 

Related Stories