NEW DELHI MEDIA HOUSE
Breaking News

అక్టోబరు 10నుంచి 18వరకు దసరా మహోత్సవాలు .

Updated: Tuesday 28,2018

ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో అక్టోబరు 10నుంచి 18వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం వైదిక కమిటీ తెలిపింది. 10న అమ్మవారు స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి అలంకారంలో, 11న బాలాత్రిపుర సుందరి, 12న గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 13న లలితా త్రిపుర సుందరి, 14న సరస్వతి (మూలా నక్షత్రం), 15న అన్నపూర్ణ, 16న మహాలక్ష్మి, 17న దుర్గాదేవి(దుర్గాష్టమి), 18న మహిషాసురమర్ధిని, రాజరాజేశ్వరి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తారని వివరించింది. మహోత్సవాలను పురస్కరించుకొని 15న అర్చక సభ, 17న వేదపండితుల సభ ఉంటాయని తెలిపింది.


 
Tags:  10 th octber to 18 nth dasara festival vijayawada kankakadurgatemple.
 

Related Stories