NEW DELHI MEDIA HOUSE
Breaking News

Political News

60 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి చాయలే లేవు..

1991లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే సునామీ సృష్టించింది. ఎంతగానంటే.. డీఎంకేకు ఆ ఎన్నికల్లో ఒకే ఒక సీటు లభించింది. అది కరుణానిధి గెలిచిన చెన్నై హార్బర్‌ నియోజకవర్గం. అప్పుడేకాదు, 60 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి చాయలే లేవు. మొత్తం 13 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.   
జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 30శాతం రాయితీ.

న్యూదిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వినియోగదారులకు 30 శాతం వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు దేశీయ, అతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనున్నాయి. ఈ ఆఫర్‌ జులై 23వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.  
కేంద్ర సమాచార కమిషన్‌ ద్విభాషా మొబైల్‌ యాప్‌

 ఆర్టీఐ కార్యకర్తలు ఇక నుంచి తమ అభ్యర్థనలను హిందీ, ఇంగ్లి్‌షలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ద్విభాషా మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  
ఏపీకి సెంట్రల్ వర్సిటీ .

ఏపీకి తీపి కబురు అందించింది కేంద్రం. రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పిన కేంద్రం.. అందులో భాగంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  
అమరావతి అత్యుత్తమ స్మార్ట్‌ నగరా .

రాజధానిని దేశంలోని అత్యుత్తమ స్మార్ట్‌ నగరాల్లో ఒకటిగా రూపొందించే లక్ష్యంతో ఏపీసీఆర్డీయే చురుగ్గా చర్యలు గైకొంటోంది. నగరవాసులకు ప్రపంచస్థాయి మౌలిక వసతులను అందుబాటులోకి తేవడం ద్వారా వారు నాణ్యమైన, సౌకర్యవంతమైన జీవనాన్ని సాగించేలా చూసేందుకు ఏర్పాటు చేసిన అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎ.ఎస్‌. ఎస్‌.సి.సి.ఎల్‌.)ఈ దిశగా ముందుకు సాగుతోంది.  
జడ్జీల పదవీవిరమణ వయసు పెంపు యోచన !!.

దిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల కొరత ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.  
విజయవాడ పోలీస్‌బాస్‌ ద్వారకా తిరుమలరావు.

విజయవాడ, విశాఖపట్నం నగర కమిషనరేట్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్‌బాస్‌లను నియమించింది. విజయవాడకు సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు, విశాఖపట్నానికి మహేష్‌చంద్ర లడ్డాలకు పోలీసు కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించింది.  
ట్రంప్‌పై కారు డ్రైవర్‌ కేసు .

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరొకరు కోర్టులో కేసు వేశారు. ట్రంప్‌ కారు డ్రైవర్‌ అయిన నోయిల్‌ సిన్ట్రన్‌(59) న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.  
జగన్ మీద జలీల్ ఖాన్ కూతురు పోటీ ?! .

పవన్ కల్యాణ్‌, ఆయన సోదరుడు చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. సొంత ఊళ్ళో మహిళ చేతిలో ఓడిపోయిన చిరంజీవి పార్టీని ముంచి మంత్రి పదవి తీసుకున్నారన్నారు. కన్నా, జగన్, పవన్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతిస్తే గుంటూరులో కన్నా మీద తాను పోటీ చేస్తానన్నారు. పులివెందులలో జగన్ మీద తన కూతురు పోటీ చేస్తుందని జలీల్ ఖాన్  అన్నారు.  
పోలీసులు బరువు తగ్గకుంటే బతుకు బరువే !!?.

బెంగళూరు: బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి... లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  
రజనీ భార్యకు షాకిచ్చిన సుప్రీం కోర్టు!

సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. రజనీ నటించిన కొచ్చాడయాన్ సినిమాకు సంబంధించి కర్ణాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటీషన్‌ను సుప్రీం తిరస్కరించింది.  
వాణిజ్యర్యాంకుల జాబితా ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానం .

సులభతర వాణిజ్య ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ, మూడోస్థానంలో హరియాణా, నాలుగో స్థానంలో జార్ఖండ్‌, ఐదో స్థానంలో గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి.  
హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరు : సీఎం

విజయవాడ: రాష్ట్రంలో రౌడీయిజం ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సోమవారం నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటున్నారని అభినందించారు.  
విజయవాడలోమల్టీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు .

విజయవాడలోని ఏఎం ఆర్‌సీ ప్రధాన కార్యాలయం ఉదయం నుంచి రాత్రి వరకు మధ్యంతర డీపీఆర్‌పై విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశానికి జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ ‘కేఎఫ్‌డబ్ల్యూ’ టెక్నికల్‌ బృందం కూడా పాలు పంచుకుంది. ఏఎంఆర్‌సీ ఎండీ ఎన్‌వీ రామకృష్ణారెడ్డితో పాటు సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ విజయ క్రిష్ణన్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జె నివాస్‌ తదితర ఇతర శాఖల అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న శిస్ర్టా ప్రతి నిధు తమ మధ్యంతర రిపోర్టును సమావేశం ముందుంచారు.  
పొలిట్‌బ్యూరోలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.

అమరావతి: తెదేపా పొలిట్‌బ్యూరోలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి చోటు దక్కింది. పార్టీలో అత్యున్నతమైన పొలిట్‌బ్యూరోలోకి ఆమెను తీసుకుంటూ తెదేపా అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. గల్లా ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు.  
ఏపీ హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌ హబ్‌ : చంద్రబాబు

తిరుపతి : సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన షియామి సంస్థ ఏపీలో తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమితో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.  
పార్టీకి చెడ్డపేరు వస్తే సహించను .

జన్మభూమి కమిటీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. జన్మభూమి కమిటీల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తే సహించబోనని ఆయన స్పష్టంచేశారు.  
ల్యాండ్ రికార్డ్లు అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ .

దావోస్: బ్లాక్ చైన్, ఫింటెక్‌కు ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్‌గా మారబోతోందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళవారం సాయంత్రం బ్లాక్ చైన్ టెక్నాలజీ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీల సిఈఓలు హాజరయ్యారు.  
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి : చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో  ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు, సరుకు రవాణా సులభతరం అవుతుందని వివరించారు.  
‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో !!

‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు అంటూ’ సీఎం చంద్రబాబును కొనియాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సామాన్యుడికి సారీ చెప్పారు. సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సీఎంకు స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.  
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins