NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

కేంద్ర సమాచార కమిషన్‌ ద్విభాషా మొబైల్‌ యాప్‌

 ఆర్టీఐ కార్యకర్తలు ఇక నుంచి తమ అభ్యర్థనలను హిందీ, ఇంగ్లి్‌షలో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ద్విభాషా మొబైల్‌ యాప్‌ను రూపొందించిందని సిబ్బంది మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  
ఏపీకి సెంట్రల్ వర్సిటీ .

ఏపీకి తీపి కబురు అందించింది కేంద్రం. రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పిన కేంద్రం.. అందులో భాగంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  
వాణిజ్యర్యాంకుల జాబితా ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానం .

సులభతర వాణిజ్య ర్యాంకులను కేంద్రం విడుదల చేసింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ, మూడోస్థానంలో హరియాణా, నాలుగో స్థానంలో జార్ఖండ్‌, ఐదో స్థానంలో గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి.  
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలి : చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో  ఉద్యాన పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని పయనీరింగ్ సంస్థకు సీఎం సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసే విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు, సరుకు రవాణా సులభతరం అవుతుందని వివరించారు.  
ఎన్నారై సహకారంతో 5 వేల డిజిటల్ తరగతులు.

విజయవాడ: ఉత్తర అమెరికా ప్రవాసాంధ్రుల సహకారంతో పాఠశాలల్లో 5000 డిజిటల్ తరగతుల ఏర్పాటు చేశామని ప్రవాసాంధ్రుల ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. మొదటి దశలో ఇప్పటికే విశాఖ జిల్లాలో 300 డిజిటల్ తరగతులు, మిగతా జిల్లాల్లో వెయ్యి డిజిటల్‌ క్లాస్‌రూంలు ప్రారంభించామని ఆయన చెప్పారు.   
50 కోట్ల మంది వినియోగదార్ల ఎస్‌బీఐ

ముంబయి: ఎస్‌బీఐలో కలవబోతున్న 5 అనుబంధ బ్యాంకుల శాఖలన్నీ ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐ శాఖలుగా కార్యకలాపాలను నిర్వర్తించనున్నాయి. ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా డిపాజిటర్లతో పాటు వినియోగదార్లందరినీ.. ఏప్రిల్‌ 1, 2017 నుంచి ఎస్‌బీఐ వినియోగదార్లుగా పరిగణిస్తామ’ని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.  
ఆంధ్రప్రదేశ్‌ వైపు బారత్ చూస్తోంది .

విశాఖ : ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ వైపు బారత్ చూస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్టాడుతూ దేశ సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. దేశంలో బలమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.  
రాష్ట్రంలో4 ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం .

విజయవాడ: ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్రంలో4 ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శ్రీసిటీలో రెండు, విశాఖ, చిత్తురులో ఒక్కో వర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ వర్సిటీ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాయిలాపడిన టైక్స్‌టైల్‌ పరిశ్రమల పవర్‌ సబ్సిడీ 300 కోట్లను ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది.  
ఎస్సీ, ఎస్టీలకు నెలకు 50 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

అమరావతి : ఎస్సీ, ఎస్టీలకు నెలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... సంపద సృష్టి, పేదల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ప్రతినెలా పంపిణీ చేస్తున్నామన్నారు.  
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు .

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయో పరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేన్లకు ఈ పరిమితి పెంపు వర్తించనుంది. యూనిఫాం సర్వీస్‌లకు మాత్రం గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2017 సెప్టెంబర్‌ 30 వరకు ఈ జీవో వర్తించనుంది.  
కాంగ్రెస్‌ పార్టీకి ఆశా "కిరణం " !!!.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత గూటికే తిరిగి వెళ్ళిపోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ఏ పార్టీ నుంచి పిలుపు రాకపోవడంతో ఇక చేసేది లేక తిరిగి అదే పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.   
భారతీయ జనతా పార్టీ పొట్టలో పొడిచిందీ:పవన్

కాకినాడ : రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ వెన్నులో పొడిస్తే... భారతీయ జనతా పార్టీ పొట్టలో పొడిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడలో జరుగుతున్న ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలే నా గాడ్‌ ఫాదర్‌ అన్నారు. అలాగే తనను ఎవరో వెనుక నుండి నడిస్తున్నారనే వార్తలను ఆయన కొట్టిపారేస్తూ నన్ను ఒకరు నడిపించాలా... నాకు పౌరుషం లేదా... అంటూ పేర్కొనగానే అభిమానులు కేరింతలు కొట్టారు. అలాగే తెలంగాణ సోదరులు మన అన్నదమ్ముళ్లని, ఇటు ఏపీకి, అటు తెలంగాణకు న్యాయం చేయలేకపోతున్నారని, హైకోర్టు విభజించకుండా తెలంగాణకు అన్యాయం చేశారన్నారు.  
కేంద్రoతో ఘర్షణ వైఖరి వద్దు , రాష్ట్రాభివృద్ధి ముద్దు : కేఈ

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉండకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా సమయంలో ఉపముఖ్యమంత్రి కేఈ... అసెంబ్లీ లాబీలో మీడియాతో ముచ్చటించారు.   
ఐటీ సేవల నాణ్యతకు ఏపీకి జాతీయ గుర్తింపు :బాబు,.

విజయవాడ : రాబోయే 3నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ డోర్‌ నెంబర్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజా సాధికార సర్వేపై సీఎం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  
నాలుగు బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

విజయవాడ: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమవుతున్న శాసనసభలో మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  
ప్రత్యేక హోదా గురించి అడిగింది నేనే : వెంకయ్య

ప్రత్యేక హోదా గురించి అడిగింది నేనే. అప్పట్లో ఎవరూ నోరెత్తలేదు. అప్పట్లో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు. అందుకే అడిగాను. ఇప్పుడు కేంద్రం ఎన్నో అభివృద్ది పనులను చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది.  
తెలుగుదేశం ప్రత్యేక హోదా గుబులు!

జనంలోకి వెళ్లి ఓట్లు అడిగే తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు ఇపుడు ఓ గుబులు పట్టుకుంది. అదే ప్రత్యేక హోదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజల మధ్యకెళ్లి ఓట్లు అడగలేమన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.   
బొజ్జలను సాగనంపేందుకు సీన్ సిద్ధం

   త్వరలో బొజ్జలకు సాగనంపేందుకు సీఎం చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నారు. కొంతమంది మంత్రులకు శాఖలను మారిస్తే బొజ్జలను మాత్రం ఏకంగా మంత్రి పదవి నుండే తొలగిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తనకు కేటాయించిన శాఖకు కనీసం పది శాతం కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి న్యాయం చేయలేకపోయారన్న ఆగ్రహంలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. దీంతో బొజ్జలను మంత్రి పదవి నుండి తొలగించి తీరాలన్న గట్టి నిర్ణయానికి బాబు వచ్చినట్లు తెలుస్తోంది.   
చర్చకు రాకుండా విమర్శించడం సరికాదు: దేవినేని కౌంటర్!!!

ఏలూరు: ఆర్‌డీఎస్‌ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి, ఒప్పించి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్‌డీఎస్‌) పనులు ఓ కొలిక్కి తీసుకొస్తే.. ఏపీ పాలకులు దానికి మోకాలడ్డటం దారుణమని హరీశ్‌రావు మంగళవారం మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంత్రి ఉమా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకుండా మాట్లాడటం సరికాదన్నారు  
ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులిస్తాం.. జైట్లీ

ఏడాది మోదీ పాలనపై ఏర్పాటుచేసిన రెండో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.   
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins