NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

ఏపీకి సెంట్రల్ వర్సిటీ .

ఏపీకి తీపి కబురు అందించింది కేంద్రం. రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక హోదా తప్ప మిగిలిన హామీలన్నీ నెరువేరుస్తామని చెప్పిన కేంద్రం.. అందులో భాగంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళుతోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.  
మార్చి 31 తర్వాత పాతనోట్లు కలిగి ఉంటే నాలుగేళ్ల జైలుశిక్ష.

దిల్లీ: పెద్దనోట్ల రద్దు ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మార్చి 31 తర్వాత రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ ఆర్డినెన్స్‌కు రూపకల్పన చేసింది. దీని ద్వారా రద్దయిన నోట్లు మరిన్ని వెనక్కి వస్తాయని కేంద్రం భావిస్తోంది  
11 అర్థరాత్రి వరకు టోల్‌ ట్యాక్స్‌ రద్దు .

దిల్లీ: రూ.500, 1000 నోట్ల రద్దు చేయడంతో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టోల్‌ రుసుము చెల్లించేందుకు చిల్లర లేక వాహనదారులు టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు .

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వయో పరిమితిని 34 నుంచి 40 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేన్లకు ఈ పరిమితి పెంపు వర్తించనుంది. యూనిఫాం సర్వీస్‌లకు మాత్రం గరిష్ఠ వయోపరిమితిలో రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2017 సెప్టెంబర్‌ 30 వరకు ఈ జీవో వర్తించనుంది.  
టైమ్స్‌నౌ అర్నబ్‌ గోస్వామికి ‘వై’ భద్రత.

దిల్లీ: ప్రముఖ పాత్రికేయుడు.. టైమ్స్‌నౌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామికి పాక్‌ ఉగ్రమూక నుంచి ముప్పు ఉండటంతో ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను సమకూర్చింది.  
10 ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.25,000,.

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన ‘తాళికు తంగమ్‌’ పథకానికి 2016-17 సంవత్సరానికి గాను రూ.204 కోట్లు కేటాయించింది. దీని ద్వారా 12,500 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. పేద కుటుంబాలకు చెందిన వధువులకు బంగారు మంగళసూత్రం చేయించేందుకు ఈ పథకం ద్వారా నగదును అందిస్తారు. ఇదే పథకం కింద పదవ తరగతి ఉత్తీర్ణులైన అమ్మాయిలకు రూ.25,000, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారికి రూ.50,000 ఆర్థికసాయం కింద ప్రభుత్వం ఇస్తుంది.  
ప్రభుత్వంపై విమర్శలు దేశద్రోహం కాదు

దిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శించడం దేశద్రోహం కిందికో పరువునష్టం కిందికో రావని నేడు సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రభుత్వంపై విమర్శలకు పరువునష్టం, దేశద్రోహం కేసులు పెట్టొద్దని న్యాయస్థానం స్పష్టంచేసింది. ఐపీసీ సెక్షన్‌ 124(ఏ) ప్రకారం దేశద్రోహం కేసుకు సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయని.. సర్వోన్నత న్యాయస్థానం గతంలోని తీర్పు ప్రకారం దేశద్రోహానికి సంబంధించి మార్గదర్శకాలను అనుసరించాలని కోర్టు తెలిపింది  
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins