NEW DELHI MEDIA HOUSE
Breaking News

Search News

జడ్జీల పదవీవిరమణ వయసు పెంపు యోచన !!.

దిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల కొరత ఎక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.  
పువ్వుకి ప్రధాని నరేంద్ర మోదీ పేరు .

ఇజ్రాయెల్‌: ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన ఓ పువ్వుకి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మంగళవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.  
ఆంధ్రప్రదేశ్‌ వైపు బారత్ చూస్తోంది .

విశాఖ : ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ వైపు బారత్ చూస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్టాడుతూ దేశ సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. దేశంలో బలమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.  
కొత్త రూ.2000 నోటు వచ్చేసింది.

హైదరాబాద్‌: కొత్త రూ.2000 నోటు చెలామణిలోకి వచ్చేసింది. నల్లధనం నియంత్రణకు ప్రధాని మోదీ తీసుకున్న సంచలనం నిర్ణయంతో బుధవారం దేశవ్యాప్తంగా పెద్దనోట్లు చెలామణి ఆగిపోయిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రవేశపెట్టింది. గురువారం ఉదయం తెరుచుకున్న బ్యాంకులు పాత నోట్లను తీసుకుని కొత్త రూ.2000 నోట్లు ఇస్తున్నాయి.  
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు మార్గం సుగమం

నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించటానికి మార్గం సుగమమైంది. విమానాశ్రయ విస్తరణ కోసం కృష్ణా జిల్లా యంత్రాంగానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ అధికారులు ప్రతిపాదించిన 698 ఎకరాలకు గాను కృష్ణా జిల్లా రెవెన్యూ యంత్రాంగం 460 ఎకరాలకు అడ్వాన్స్‌ పోర్షన్‌ ఇచ్చింది.   
దేశంలో తొలిస్థానంలో ఏపీ , అద్భుతమైన ప్యాకేజీ,.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే అజెండాగా పనిచేస్తున్నామన్న విషయం ప్రజలకు వివరించాలని ప్రధాని నరేంద్రమోదీ భాజపా నేతలకు సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తున్నామన్నారు. ఆ విధంగానే అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చామనీ, నిరంతరం సహకారం కొనసాగుతుందని తెలిపారు.  
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins