NEW DELHI MEDIA HOUSE
Breaking News

Sports

సింధుకు బాబు భారీ నజరానా కలెక్టర్‌ !!

భారత అగ్రశ్రేణి షట్లర్‌, రియో ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని సింధు తల్లి విజయ ధృవీకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.    
పాకిస్తాన్‌తో 'నో ఆట ,.

పాపాల పాకిస్తాన్‌.. అనబడే 'పాపిస్తాన్‌'తో ఇకపై ఎక్కడా క్రికెట్‌ ఆడకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య క్రికెట్‌ పోటీలు దాదాపుగా నిలిచిపోయాయి. భారత జట్టు పాకిస్తాన్‌ వెళ్ళడంలేదు.. పాకిస్తాన్‌ జట్టు భారత్‌కి రావడంలేదు. అయితే, విదేశాల్లో జరిగే ట్రై సిరీస్‌, ఇతర టోర్నీల్లో మాత్రం అప్పుడప్పుడూ భారత్‌, క్రికెట్‌ తలపడ్తున్నాయి.  
బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప్రసాద్‌ ,.

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్‌ నియమితులయ్యారు. ముంబయిలో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో సందీప్‌ పాటిల్‌ స్థానంలో ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  
రవిచంద్రన్‌ అశ్విన్‌ మైదానంలోనే క్రికెటర్‌తో గొడవ !!.

భారత సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మైదానంలోనే సహచర క్రికెటర్‌తో గొడవకు దిగి ఏకంగా భౌతిక దాడికే ప్రయత్నించడం క్రికెట్‌ వర్గాల్లో సంచలనం రేపుతోంది. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్ల మ్యాచ్‌ జరిగింది.  
భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పెళ్లి

రియో ఒలింపిక్స్‌లో మహిళల రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత రెజ్లర్ సాక్షి మాలిక్. ఈమెకు కాబోయే వరుడు ఎవరో తెలిసిపోయింది. ఒలింపిక్స్ తర్వాత సాక్షి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానో సహచర రెజ్లింగ్ ఆటగాడిని పెళ్లి చేసుకోబోతున్నాని, అయితే తనకు కాబోయే భర్త పేరు మాత్రం సీక్రెట్ అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.  
ఒలింపిక్స్‌ నుంచి పరీక్షలకు........

అగర్తలా: దీపా కర్మాకర్‌.. రియో ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్‌ విభాగంలో తృటిలో పతకం చేజార్చుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవకపోయినా.. దేశ ప్రజల హృదయాలను మాత్రం గెలుచుకుంది. దీప తన ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తుందో చదువుకు కూడా అంతే విలువిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ ఘటన. రియో నుంచి వచ్చిన మర్నాడే దీప తన ఎంఏ పరీక్షలకు హాజరైంది.  
దీపకు ఘన స్వాగతం....

దిల్లీ: ఒలింపిక్స్‌కు వెళ్లిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌ రియో నుంచి స్వదేశానికి చేరుకుంది. శనివారం ఉదయం దిల్లీ చేరుకున్న ఆమెకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. త్రుటిలో పతకం చేజారినప్పటికీ దీప తన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలుచుకుంది. అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దీపకు శుభాకాంక్షలు తెలిపారు.  
సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు!

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సత్తా చాటిన సింధు.. తన ప్రత్యర్థిపై విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు ధీటుగా రాణించి పతకం కైవసం చేసుకుంటే.. ఆమెకు ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురిపించేందుకు స్పాన్సర్లు రెఢీ అవుతున్నారు.  
చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై ప్రశంసల జల్లు....

రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన పి.వి.సింధుపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు  సోనియా గాంధీ, బీజేపీ అధినేత అమిత్ షా,  పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రశంసల వర్షం కురిపించారు.   
రాఖీరోజు సాక్షిమాలిక్‌ చరిత్ర సృష్టించింది

దిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం తెచ్చిపెట్టిన సాక్షిమాలిక్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాఖీరోజు భారత ఆడబిడ్డ సాక్షిమాలిక్‌ దేశానికి పతకం సాధించటం గర్వకారణంగా ఉందన్నారు. పతకం సాధనతో ఆమె చరిత్ర సృష్టించిందని.. దేశంలోని క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.  
‘ఎమ్‌.ఎస్‌ ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమ్‌.ఎస్‌ ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ను దిల్లీలో సుషాంత్‌ సింగ్‌ చదివిన కులాచి హన్స్‌రాజ్‌ మోడల్‌ స్కూల్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ధోనీ కూడా విచ్చేశారు. ధోనీ రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఈ చిత్రంలో ధోనీ భార్య పాత్రలో కైరా అడ్వాని నటించింది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.   
బంగారు చేప రికార్డును బద్దలు కొట్టాడు.

రియో డి జ‌నీరో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో అమెరికా బంగారు చేప మైకేల్ ఫెల్ప్స్ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ గోల్డ్ ఫిష్ 2168 యేళ్ళనాటి రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా ఒలింపిక్స్ క్రీడల్లో 22వ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, వ్యక్తిగతంగా ఇది 13వ గోల్డ్ మెడల్.   
పేస్‌కు ఘోర అవమానం !!!!

రియో: భారత లెజండరీ టెన్నీస్ ఆటగాడు లియాండర్ పేస్‌కు ఘోర అవమానం జరిగింది. ఒలింపిక్స్-2016లో పాల్గొనేందుకు గురువారమే బ్రెజిల్ రాజధాని రియో చేరుకున్న లియాండర్‌కు రూమ్ కేటాయించలేదు. దీంతో వేరే ఆటగాడితో కలిసి రూమ్ షేర్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పేస్ మనస్థాపానికి గురయ్యాడు.     
మనోహర్ వారసుడిగా ఠాకూర్ !!

ముంబయి: శశాంక్‌ మనోహర్‌ వారసుడెవరో తేలిపోయింది. ముంబయిలో జరగబోయే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు. శనివారం అధ్యక్ష పదవికి ఠాకూర్‌ ఒక్కడే నామినేషన్‌ వేశాడు. అతను బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశాడు. ప్రస్తుతం బోర్డు అధ్యక్షుణ్ని ప్రతిపాదించే అధికారం ఈస్ట్‌ జోన్‌దే. ఆ జోన్‌లోని ఒక సంఘం ప్రతిపాదించినా అధ్యక్ష పదవికి పోటీ చేయొచ్చు. ఐతే భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా అయిన ఠాకూర్‌కు మద్దతుగా ఈస్ట్‌ జోన్‌లోని ఆరు సంఘాలూ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయడం విశేషం. ఐసీసీ ఛైర్మన్‌ పదవి చేపట్టడం కోసం మనోహర్‌ కొన్ని రోజుల కిందటే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనురాగ్‌ స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడైన షిర్కే ఎంపికయ్యే అవకాశాలున్నాయి. లోధా కమిటీ ప్రతిపాదనల్ని అమలు చేసే సామర్థ్యం లేకపోవడం వల్లే తాను బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నానని శశాంక్‌ మనోహర్‌ తెలిపాడు.  
రియో ఒలింపిక్స్ : భారత్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా రెహమాన్‌

రియో ఒలింపిక్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఆస్కార్‌ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ ఎంపికయ్యారు. భారత తరపున గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపికైన వారిలో రెహ్మాన్ నాలుగో సెలెబ్రిటీ కావడం గమనార్హం.  
కోహ్లి@ నంబర్ వన్

కోహ్లి@ నంబర్ వన్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లో విశేషంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.   
రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు

రిషబ్ పాంట్ సరికొత్త రికార్డు  అండర్-19 వరల్డ్ కప్ లో యువ భారత్ ఓపెనర్ రిషబ్ పాంట్ దుమ్మురేపాడు.  
ఓడిన భార

ఓడిన భారత్... సిరీస్ ఆస్ట్రేలియాకే  
కోల్‌కతాలో అడుగుపెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం పీలే

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆదివారం కోల్‌కతాకు చేరుకున్నారు.  
ప్రొఫెషనల్ బాక్సింగ్ ఫైట్ : బ్రిటన్ బాక్సర్‌ను చిత్తుచేసిన విజేందర్ సింగ్

భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్ సింగ్ తాను అనుకున్నది సాధించాడు. తన నిర్ణయంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు కదా.. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ ఫైట్‌లో బ్రిటన్ బాక్సర్ సోని వైటింగ్‌ను మూడో రౌండ్‌లోనే మట్టికరిపించాడు. ఫలితంగా ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ తొలి పోరులోనే తన పవర్‌ ఏంటో చూపించాడు.   
 
Video Gallery
Photo Gallery
  • Movie Gallery
  • heroins